Fifa 2014 world cup starts on june 12

FIFA 2014 World Cup starts on June 12,2014 World Cup starts on Thursday, FIFA 2014 World Cup opening ceremony, FIFA World Cup

FIFA 2014 World Cup starts on June 12,2014 World Cup starts on Thursday, FIFA 2014 World Cup opening ceremony, FIFA World Cup

నేటి నుండే సాకర్ సంబరాలు మొదలు

Posted: 06/12/2014 11:02 AM IST
Fifa 2014 world cup starts on june 12

ఖండాంతరాల్లో సాకర్ ప్రియులు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న 20వ ప్రపంచఫుట్ బాల్ టోర్నీ ఈ రోజు నుండే ప్రారంభం కాబోతుంది. ఫుట్ బాల్ కి పుట్టినిట్లుగా చెప్పుకునే బ్రెజిల్ లో ఈ ప్రపంచకప్ జరుగుతుండంతో దీనికి ఇంకా ఊపు వచ్చింది. నేటి రాత్రి 11 గంటలకు ఆరంభం అయ్యి నెల రోజుల పాటు ఫుట్ బాల్ ప్రియుల్ని అలరించనున్నారు. ప్రపంచ దేశాల స్టార్ ఆటగాళ్ళ విన్యాసాలు చూస్తూ... సాంబా న్రుత్యాలు ఆస్వాదిస్తూ ఎప్పుడెప్పుడు గోల్ అవుతుందా ? గోల గోల చేద్దామా అని ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తారు.

నేటి తొలి మ్యాచ్ లో ఆతిధ్య దేశం (గ్రూపు - ఎ) బ్రెజిల్ తో క్రోయేషియా తలపడుతుంది. తొలి మ్యాచ్ బ్రెజిల్ దే కావడంతో అక్కడి వారు టైం ఎప్పుడెప్పుడు గడుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ ట్రోర్నీలో ఫేవరెట్ జట్లుగా బ్రెజిల్ ముందు వరసలో ఉంటే అర్జెంటీనా, డిపెండింగ్ చాంపియన్ స్పెయిన్, జర్మనీ రెండో వరుసలో ఉన్నాయి. 32 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో చివరి మజిి చేరేది ఎవరో చూడాలి.

బలా బలాల విషయానికి వస్తే...

బ్రెజిల్ చాలా రోజుల తరువాత తన సొంత గడ్డ పై తనకు అనుకూలమైన పరిస్థితుల మధ్య ఆడుతుంది. యువ, అనుభవం గల ఆటగాళ్ళు ఇందులో ఉండటం వీరికి చాలా కలిసి వచ్చే అంశం. డిఫెన్స్ లో తిరుగులేని బ్రెజిల్ కప్పు గెలవడం తప్ప ఏం సాధించినా తక్కువే. సొంత గడ్డ పై ఆడుతున్నామనే సంబురం ఉన్నా, త్రీవ ఒడిత్తి ఉండటం ఈ జట్టకు బలహీన అంశం.

కప్ నిర్మాణ విషయానికి వస్తే... ప్రస్తుతం ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీ 1974లో రూపొందించారు. 36.5 సెంటి మీటర్ల ఎత్తు 6.175 కిలోల బరువుతో 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. ఈ టోర్నీ ఫ్రైజ్ మనీ 3415 కోట్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles