లుంబిని పార్క్
ఈ పార్క్ బెంగళూరు నగరంలోని హెబ్బాల్ కి సమీపంలో ఉన్నది. ఇక్కడ బోటింగ్ కి సైతం అనుకూలంగా వుంటుంది. ఈ పార్క్ సుమారుగా ఒకటిన్నర కిలోమీటర్ పొడవు ఉంటుంది. బుద్దుని జన్మస్థలం పేరిట ఏర్పాటైన ఈ లుంబిని పార్క్ లో బుద్ధుని స్మారకార్ధం 25 అడుగుల ఎత్తైన విగ్రహం నెలకొల్పారు.