బెంగళూరు ప్యాలెస్
నగరం నడిబొడ్దున వున్న ఈ ప్యాలెస్ ఓ గార్డెన్ లో ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంది. సుమారు 45000 చ.అడుగులు గల ఈ ప్యాలెస్ ను కట్టడానికి 82 సంవత్సరాల సమయం పట్టింది. ఇందులోని దిగువ అంతస్తులో ఉండే ప్రాంగణంలో నీలిరంగు సిరామిక్ టైల్స్, పొదిగిన గ్రానైట్ కుర్చీలు రాత్రి వేళల్లో చాలా అందంగా కనిపిస్తాయి. పైన ఉండే అంతస్తులో రాజుగారు సభ చేసిన విశాలమైన దర్బార్ హాలు చూడవచ్చు.