Health and Beauty Benefits with Coconut | Coconut Water Milk

Health beauty benefits with coconut water milk

coconut health benefits, coconut beauty benefits, coconut water, coconut milk, coconut nutrients, coconut news, coconut products, coconut beauty tips, coconut health tips, coconut water benefits, coconut milk benefits

health beauty benefits with coconut water milk : The Health and Beauty Benefits with Coconut. Mainly in coconut water and milk there are number of nutrients available which improves the health conditions.

కొబ్బరిలో దాగివున్న పోషక విలువలు

Posted: 04/08/2015 01:44 PM IST
Health beauty benefits with coconut water milk

మానవ శరీరానికి అవసరమయ్యే ఆరోగ్యకరమైన పోషక విలువలు కొబ్బరిలో ఎన్నో దాగివున్నాయి. అవి ఆరోగ్యానికి, అందానికీ ఎంతో మేలు. ఈ కొబ్బరిని నిత్యం ఉపయోగిస్తే బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా అమృతంలా పనిచేసే కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలల్లో విటమిన్ ఏ, బీ, సీ రిబోఫ్లోవిన్, ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ప్రొటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎన్నోరకాల హానికారక సూక్ష్మజీవుల నుంచి పోరాడి, ఆరోగ్యంగా వుండేందుకు సహకరిస్తాయి. అలాగే.. రకరకాల చిరుజబ్బులు దరిచేరకుండా కాపాడుతాయి.

కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
 
* బాలింతలకు అధిక రక్తస్రావం ఇబ్బంది పెడుతున్న సమయంలో కొబ్బరి పువ్వు జ్యూస్‌ను తీసుకుంటే వెంటనే ఉపశమనం దొరుకుతుంది.
* సాధారణంగా కొన్ని కొబ్బరికాయల్లో పువ్వు వచ్చే విషయం తెలిసిందే! ఆ పువ్వు గర్భాశయానికి మేలు చేస్తుంది.
* నిత్యం కొబ్బరినీళ్లు తాగితే మూత్రపిండాల సమస్యలు దరిచేరవు. శరీరానికి చల్లదనం లభిస్తుంది.
* గొంతు మంట, నొప్పిగా ఉన్నప్పుడు కొబ్బరిపాలు తాగితే సరిపోతుంది.
* కొబ్బరి నూనెలో యాభై శాతం లారిక్ ఆమ్లం ఉంటుంది. దీన్ని వంటల్లో అధికంగా ఉపయోగిస్తే గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కొవ్వుశాతం పెరగదు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
* కొబ్బరి నూనెలో విటమిన్ ఈ అధికం. ఇది చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది. రోజుకు రెండు చెంచాల నూనె తీసుకుంటే జీర్ణవ్యవస్థకు మంచిది. థైరాయిడ్ సమస్య ఉండదు.
* పొడి చర్మం ఉన్నవారు పచ్చికొబ్బరి తీసుకుంటే శరీరానికి సరిపడా తేమ అందుతుంది.
* కొబ్బరిపాలు చర్మానికి పట్టిస్తే మృతకణాలు, మురికి తొలగిపోతుంది. శరీర చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇది జుట్టుకూ మేలు చేస్తుంది.
* జుట్టు కాంతివిహీనంగా కనిపిస్తుంటే ఇలా చేయండి. కొబ్బరిపాలను తలకు పట్టించి అరగంట పాటు మర్దన చేయాలి. దీనివల్ల శిరోజాలు పట్టుకుచ్చుల్లా జాలువారతాయి. కొత్త నిగారింపును సంతరించుకుంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coconut health benefits  health tips  coconut water milk  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more

Today on Telugu Wishesh