Groundnuts Health Benefits | heart attack | ovairy problems | uterus pain | diabetes

Groundnuts health benefits heart attack ovairy problems uterus pain diabetes

groundnuts health, groundnuts health benefits, health tips, groundnuts health tips, groundnuts curries, groundnuts foods, groundnuts photos, health tips telugu, health home remedies, healthy food items, healthy foods, healthy tips

groundnuts health benefits heart attack ovairy problems uterus pain diabetes : The Health benefits in groundnuts which prevents heart attack, ovairy problems, uterus pain, diabetes and many other diseases. These groundnut contains more nutrients.

వేరుశెనగల్లో దాగివున్న హెల్త్ బెనిఫిట్స్

Posted: 04/10/2015 02:56 PM IST
Groundnuts health benefits heart attack ovairy problems uterus pain diabetes

ప్రకృతి సహజంగా లభించే ప్రతిఒక్క ఫుడ్ లోనూ మానవ శరీరానికి అవసరమయ్యే పోషకాలు నిల్వవుంటాయి. అలా లభించే తినుబండారాల్లో వేరుశెనగలు ఒకటి! వీటిలో ఎన్నోరకాల అద్భుతమైన పోషకాలు దాగి వున్నాయి. మధుమేహం, గుండెపోటు, గర్భాశయ సమస్యలు, కేన్సర్, ఒబిసిటీ తదితర సమస్యలను చెక్ పెట్టే ఔషధాలు వీటిల్లో వుంటాయి.

వేరుశెనగల్లోని పోషకాలు వాటి పనితీరు :

1. మాంగనీస్ : శెనగల్లోని మాంగనీస్ అధిక మోతాదులో వుంటుంది. ఇది రక్తంలోని పిండి పదార్థాల కొవ్వును క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా డయాబెటిస్‌ వ్యాధిని దూరం చేసుకోవచ్చు. పిల్లలు, వృద్ధులు రోజూ వేరుశెనగల్ని తీసుకుంటే.. ఎముకల వ్యాధుల నుంచి కూడా తప్పించుకోవచ్చునని, మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజుకు గుప్పెడు వేరుశెనగల్ని తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

2. యాంటీ ఆక్సిడెంట్స్ : ఇవి గుండెపోటును నివారించడంలో కీలకపాత్ర వహిస్తాయి. రోజూ 30 గ్రాముల వేరుశెనగలు తింటే హార్ట్ వాల్స్‌ను భద్రపరిచినట్లు అవుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ శరీర బరువును తగ్గిస్తాయి.. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టడంలో ప్రముఖపాత్ర పోషిస్తాయి. జ్ఞాపకశక్తిని వృద్ధి చేయడంలో తమవంతు కృషి చేస్తాయి. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి.. మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

3. ఫోలిక్ యాసిడ్ : ఇది వేరుశెనగల్లో పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమంగా తీసుకుంటే గర్భాశయ సమస్యలుండవు. రోజూ శెనగలు తింటే.. గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో గడ్డలు, సంతానలేమి వంటి సమస్యల నుంచి దూరంగా వుండవచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు.
 
మొత్తానికి ఈ వేరుశెనగల్లో మహిళలకు కావలసిన ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలతోపాటు విటమిన్ ఇ1, ఇ12, నియాసిన్, పీచు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి.. ఈ వీటిని ప్రతిరోజూ తీసుకుంటే ఆరోగ్యంగా వుండవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : groundnuts health benefits  health tips  healthy food items  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more

Today on Telugu Wishesh