healthy foods for Lung health | Respiratory diseases | health tips

Healthy foods for lung health removes respiratory diseases

lung health tips, healthy foods, healthy food items, healthy foods, nutrient foods, healthy fruits, healthy juice, Respiratory diseases, Lung health, lung health foods

healthy foods for Lung health removes Respiratory diseases : There are some healthy foods are available in which nutrients are in high level. Those supports for lung health and removes Respiratory diseases

ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచే ఫుడ్స్

Posted: 04/02/2015 04:08 PM IST
Healthy foods for lung health removes respiratory diseases

ప్రస్తుతకాలంలో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. వాహనాల వినియోగం మునుపటికంటే ఎక్కువగా పెరిగిపోవడంతో వాటి నుంచి వెలువడే కలుషిత వాయువు వాతావరణంలో కలిసిపోతుంది. ఇటువంటి వాయువును పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లో అనేకరకాల సమస్యలు ఎదురవుతాయి. శ్వాసకోశ సంబంధిత వ్యాధులూ సంక్రమిస్తాయి. మొదట్లో దీని ప్రభావం అంతగా కనిపించదు కానీ.. కాలక్రమంలో ఇది విషమంగా మారుతుంది.

అలాంటి సమయాల్లో ఈ ఊపిరితిత్తుల సమస్యల నుంచి బయటపడటం అంత సాధ్యమైన విషయం కాదు. కాబట్టి.. ఊపిరితిత్తులను కలుషిత వాయువు నుంచి దూరంగా వుంచాలంటే, అవి నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే.. పోషకాలతో నిండిన ఫుడ్స్ తీసుకుంటే చాలు. ఆ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకుంటే ఇవి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. ఇంకా శ్వాస సమస్యల చికిత్సకు ఎంతగానో సహకరిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ పౌష్టిక ఫుడ్స్ ఏంతో తెలుసుకుందామా..
 
1. ఆరెంజ్ పండ్లు : ఇందులో సి విటమిన్ వుంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని పెంచుతుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
 
2. దానిమ్మపండ్లు : వీటిలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా వుంటాయి. ఇవీ ఊపిరితిత్తులలోతీ కణితులను నివారించడంలో సహాయం చేస్తాయి. అలాగే శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయి.
 
3. ఉల్లిపాయలు : వీటిలో ఉండే ఆవిర్లు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. పొగ త్రాగేవారు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కోసం తప్పనిసరిగా ఉల్లిపాయలను తినాల్సిందే!
 
4. యాపిల్స్ : వీటిలో ఫ్లేవనాయిడ్స్, విటమిన్లు E, B, C ఉంటాయి. ఈ మూలకాలు ఊపిరితిత్తులను శుభ్రం చేస్తూ.. వాటిని ఆరోగ్యంగా వుంచడంలో కీలకపాత్ర వహిస్తాయి.
 
5. ద్రాక్షపండు : వీటిలో ‘నరింగిన్’ అనే కీలకమైన ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తులలో కంతి పెరుగుదలను బంధించడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lung health tips  Respiratory diseases  nutrient foods  healthy food items  

Other Articles

  • Husband wife relationship tips angry wife convince tips

    భార్య కోపంగా వుందా.. అయితే ఇలా చెయ్యండి!

    Jun 04 | సంసార సాగరంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు కోపతాపాలు రావడం సర్వసాధారణం. అందుకని వాటిని పదే పదే ఆలోచించుకుంటూ పోతే.. జీవితమే బోరింగ్‌గా ఉంటుంది. అందుచేత భార్య భర్తపై కోప్పడినా, భర్త భార్యపై కోప్పడినా.. కాస్త... Read more

  • Onion health benefits home remedies heart diseases cancer problems

    పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

    Jun 03 | కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్... Read more

  • Carrot best food to take in tea break times health home remedies

    టీ బ్రేక్ లో క్యారెట్ తీసుకోవడం ఆరోగ్యకరం!

    May 28 | ఉద్యోగస్తులు టీ బ్రేక్ సమయంలో రకరకాల స్నాక్స్ తీసుకుంటుంటారు. చాలామంది స్నాక్స్ గా బిస్కెట్లు, బర్గర్లు, ఇంకా ఇతర జంక్ ఫుడ్లు తీసుకుంటారు. అయితే.. వాటిని ప్రతిరోజూ తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పవు.... Read more

  • Jackfruits health benefits piles problems beauty home remedies

    పనసపండు తినండి.. ‘పైల్స్’ను నివారించండి!

    May 27 | ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాహారాల్లో పనసపండు ఒకటి! ఇందులో మానవ శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా వుంటాయి. అవి.. శరీరంలో శక్తిని పెంచి, వివిధరకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇంతకీ.. ఈ... Read more

  • Litchi fruit health beauty benefits home remedies face packs heart diseases

    లిచీ ఫ్రూట్.. ఆరోగ్యానికి దివ్యౌషధం!

    May 25 | సాధారణంగా ప్రకృతి సహజంగా లభించే పండ్లలో పోషక విలువలు అధికంగా వుంటాయి. అలాంటి పండ్లలో లిచీ ఫ్రూట్ కూడా ఒకటి! ఇందులో ఎన్నో పోషకాలు, మినరల్స్ వుంటాయి. అవి.. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.... Read more