‘Dangal’ sisters’ cousin Ritika Phogat dies by suicide ‘దంగల్ సిస్టర్స్’ సోదరి రితికా ఫోగట్ ఆత్మహత్య

Dangal sisters cousin ritika phogat allegedly dies by suicide after losing wrestling bout

Wrestling, ritika phogat suicide, ritika phogat news, Ritika Phogat death, Ritika Phogat, Geeta Phogat, babita phogat, sports news, sports

17-year-old Ritika Phogat, a cousin of star wrestlers Geeta Phogat and Babita Phogat, allegedly died by suicide on Wednesday after she lost a final bout at a wrestling tournament in Bharatpur, Rajasthan. The championship was held in Rajasthan's Bharatpur from March 12 to 14.

‘దంగల్ సిస్టర్స్’ సోదరి రితికా ఫోగట్ ఆత్మహత్య

Posted: 03/18/2021 08:03 PM IST
Dangal sisters cousin ritika phogat allegedly dies by suicide after losing wrestling bout

జూనియర్‌ స్థాయి రెజ్లింగ్‌ క్రీడాకారిణి రితికా ఫొగట్‌ అనుమానాస్పద స్థితిలో మరణించింది. స్టార్‌ రెజ్లర్‌ ఫొగట్‌ సోదరీమణుల బంధువైన అమె రెజ్లింగ్ క్రీడలో రాణించలేకనో లేక ఓటమి పాలయ్యానని కలత చెందో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని హరియాణా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ రెజ్లర్లు గీతా, బబితా ఫొగట్‌ కజిన్‌ అయిన 17ఏళ్ల రితిక.. మహవీర్‌ ఫొగట్‌ స్పోర్ట్స్ అకాడమీలో రెజ్లింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది.

ఇటీవల భరత్ పూర్లో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్రస్థాయిలో సబ్‌ జూనియర్‌, జూనియర్‌ రెజ్లింగ్‌ పోటీల్లో ఆమె పాల్గొంది. ఈ టోర్నీలో ఫైనల్‌ వరకు చేరిన రితిక.. తుది పోటీలో కేవలం ఒకే ఒక్క పాయింట్‌తో ఓటమి చవిచూసింది. దీంతో నాటి నుంచి తీవ్ర మనస్తాపానికి లోనైన ఆమె.. బుధవారం రాత్రి మహవీర్‌సింగ్‌ ఫొగట్ నివాసంలోనే తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. టోర్నీలో ఓటమితో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. రితిక మరణంతో ఫొగట్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles