Iranian wrestler Navid Afkari sentenced to death రెజ్లింగ్ ఛాంపియన్ నవీద్ అఫ్కారీ ఉరితీత

Iranian wrestler navid afkari executed over stabbing security guard to death in 2018

Navid Afkari, Iranian Wrestler, Execution, navid afkari executed, navid afkari execution, navid afkari death penalty, wrestler navid afkari, iran death penalties, iran us news trump iran, Donald TRump, Iran, International news, sports news

Iranian state television aired a video last week in which Afkari appeared to confess to Turkman's killing. The television also showed what appeared to be written confessions by Afkari, but he said in a recording circulated on social media that he was coerced into signing the documents.

రెజ్లింగ్ ఛాంపియన్ నవీద్ అఫ్కారీకి ఉరిశిక్ష విధించిన ఇరాన్

Posted: 09/13/2020 09:02 PM IST
Iranian wrestler navid afkari executed over stabbing security guard to death in 2018

ఇరాన్ ఛాంపియన్ రెజ్లర్ నవీద్ అఫ్కారీని ఈ ఉదయం ఉరితీశారు. 2018లో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగిన సమయంలో ఓ సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి చంపాడన్న ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు అతనికి ఉరిశిక్షను విధించింది. ఈ ఉదయం లీగల్ అంశాలను పూర్తి చేసిన తర్వాత అఫ్కారీని ఉరితీశారని స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు, ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించింది. చేయని తప్పును ఒప్పుకునేలా అఫ్కారీని టార్చర్ కు గురి చేశారంటూ అతని కుటుంబసభ్యులు, సామాజిక కార్యకర్తలు ఆరోపించారు.

ఇక నవీద్ అఫ్కారీ తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, అఫ్కారీని ఎవరూ టార్చర్ చేయలేదని వ్యాఖ్యానించింది. మరోవైపు, 85 వేల మంది క్రీడాకారులతో కూడిన ఒక గ్లోబల్ యూనియన్ గురువారం నాడు స్పందిస్తూ, అఫ్కారీని ఉరితీస్తే క్రీడా ప్రపంచం నుంచి ఇరాన్ ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా అఫ్కారీని ఉరి తీయవద్దంటూ సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం నడిచింది. అయినా అఫ్కారీని ఉరితీయడంతో క్రీడా ప్రపంచం మూగబోయింది. మరోవైపు నవీద్ కు క్షమాబిక్ష ప్రసాదించాలని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశాన్ని కోరిన 24 గంటలు కాకముందే అయనను ఉరితీయడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Navid Afkari  Iranian Wrestler  Execution  Donald TRump  Iran  International news  sports news  

Other Articles