bodda Pratyusha Bags 'Woman Grandmaster' Title ప్రత్యూషకు మహిళా ‘‘గ్రాండ్ మాస్టార్’’ టైటిల్

Bodda pratyusha bags woman grandmaster title at gibraltar international chess festival

Bodda Pratyusha, Bodda Pratyusha news, Bodda Pratyusha achievements, Bodda Pratyusha latest, Bodda Pratyusha updates, Bodda Pratyusha new title, Bodda Pratyusha title, Bodda Pratyusha Woman Grandmaster, Bodda Pratyusha Bags Woman Grandmaster Title, Gibraltar, Gibraltar International Chess Festival, London

Bodda Pratyusha, a Telugu girl bagged the title 'Woman Grandmaster' title. She bagged this title in the Gibraltar International Chess Festival that is taking place in London. She bagged the third norm Woman Grandmaster title in this international chess festival.

చెస్ చిచ్చరపిడుగు ప్రత్యూషకు మహిళా ‘‘గ్రాండ్ మాస్టార్’’ టైటిల్

Posted: 02/01/2020 10:39 AM IST
Bodda pratyusha bags woman grandmaster title at gibraltar international chess festival

చిన్ననాటి నుంచి తనకు ఆట మీద మక్కువతో చిచ్చరపిడుగులా చెలరేగిపోయిన తెలుగుతేజం బొడ్డా ప్రత్యూష తాజాగా తన ఖాతాలో మరో టైటిల్ ను దక్కించుకుంది. తాజాగా జరుగుతున్న అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్ లో ఆమె మహిళా గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లాండ్ లో వేదికగా జరిగిన జిబ్రాల్టర్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంటులో ప్రత్యూషకు మూడో మహిళా గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌ లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనతను అందుకున్న మూడో మహిళా క్రీడాకారణిగా ప్రత్యూష నిలిచింది.

ఇదివరకు కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. ఆ తరువాత వారి కోవలోనే ఈ ఘనతను సాధించిన మూడో క్రీడాకారిణిగా ప్రత్యూష నిలిచింది. కాగా, ప్రత్యూష మూడేళ్ల క్రితమే తొలి రెండు నార్మ్ లను సాధించింది. తాజాగా జిబ్రాల్టర్‌ టోర్నీలో తొమ్మిది రౌండ్లలో 5 పాయింట్లు సంపాదించి మూడో నార్మ్‌ అందుకోవడం ద్వారా ఈ హోదా సాధించింది. అయితే భారత దేశవ్యాప్తంగా ఈ హోదాను అందుకున్న వారి సంఖ్య ఏడు. కాగా తాజా విజయంతో ఈ గ్రాండ్ మాస్టార్ టైటిల్ అందుకున్న ఎనిమిదో క్రీడాకారిణి ప్రత్యూష నిలిచింది.

ఇప్పటిదాకా ఎనిమిది జాతీయ, 24 అంతర్జాతీయ పతకాలు గెలిచిన ప్రత్యూష.. జిబ్రాల్టర్‌ టోర్నీలో 25 పాయింట్లు సాధించి మొత్తం మీద ఎలో పాయింట్ల సంఖ్యను 2325కు పెంచుకుంది. గతేడాది జాతీయ సీనియర్‌ చెస్‌లో నాలుగో స్థానం సాధించిన ప్రత్యూష.. బీజింగ్‌ చెస్‌ టోర్నీలో అయిదో స్థానంలో నిలిచింది. ఇక భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అమెకు క్రీడాభిమానుల నుంచి ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bodda Pratyusha  woman Grand Master  Chess  Grandmaster Title  Gibraltar  

Other Articles