Saina, Srikanth, Sameer out of Thailand Masters ధాయ్ లాండ్ లో తొలి రౌండ్ తోనే ముగిసిన భారత్ పోరు

Kidambi srikanth sameer verma out of thailand masters in opening round

thailand masters, thailand masters results, kidambi srikanth, sameer verma, saina nehwal, hs prannoy, Badminton, sports, sports news, latest Badiminton news, Badminton news, sports

Saina Nehwal suffered a shock defeat to Denmark's Line Hojmark Kjaersfeldt in first round of the Thailand Masters. Meanwhile Kidambi Srikanth, HS Prannoy and Sameer Verma were also knocked out after suffering first-round defeats.

థాయ్ లాండ్ మాస్టార్స్: తొలి రౌండ్ లోనే నిష్క్రమించిన భారత్

Posted: 01/22/2020 09:14 PM IST
Kidambi srikanth sameer verma out of thailand masters in opening round

థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌లో మంచి ప్రదర్శన చేసి ర్యాంకింగ్ మెరుగుపరుచుకోవాలనుకున్న భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు నిరాశే మిగిలింది. ఇండోనేషియా క్రీడాకారుడు షెసర్ హిరెన్ చేతిలో ఓడి తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టాడు. 48 నిమిషాలు పాటు సాగిన మ్యాచ్‌లో రెండో సీడ్‌ కిదాంబి ప్రత్యర్థి చేతిలో 21-12, 14-21, 12-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. తొలుత ఆధిపత్యం చెలాయించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్న తర్వాత గేమ్స్‌ల్లో కిదాంబి తేలిపోయాడు. తొలి రౌండ్‌లోనే అతడు టోర్నీల నుంచి నిష్క్రమించడం వరుసగా ఇది మూడో సారి.

థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌లో మరో భారత షట్లర్‌ సమీర్‌వర్మ కూడా తొలిరౌండ్‌లోనే నిష్క్రమించాడు. లీ జి జియా (మలేషియా) చేతిలో సమీర్‌ 16-21, 15-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. భారత షట్లర్లు సైనా నెహ్వాల్, ప్రణయ్‌ లు కూడా తొలి రౌండ్ లోనే తమ పోరును ముగించేశారు. ప్రణయ్ రాయ్ తన ప్రత్యర్థితో మలేషియా కు చెందిన లివ్యూ డారెన్ తో కాసింత సేపు గట్టిగానే పోరాడినా.. అది అతడిని మరో రౌండ్ కు పంపేందుకు దోహదపడలేదు. ఫలితంగా ప్రత్యర్థి చేతిలో 17-21, 22-20, 19-21 ఓడిపోయాడు.

ఇక భారత్ నుంచి పోరులో నిలిచిన ఒంటరి మహిళా క్రీడాకారణి సైనా నెహ్వాల్ కూడా తొలి రౌండ్ లోనే ప్రత్యర్థి లైన్ హోజ్ మార్క్ (డెన్ మార్క్) చేతిలో 13-21, 21-17, 15-21 ఓటమిని చవిచూసి తిరుగుముఖం పట్టారు. దీంతో థాయ్ లాండ్ మాస్టార్స్ లో భారత్ నిష్క్రమించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించే అవకాశాలను కూడా సైనా, శ్రీకాంత్ కోల్పోయారు. ఏప్రిల్ 26 లోపు ర్యాంకింగ్స్‌లో తొలి 16 స్థానాల్లో ఉండివుంటే వారికి అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం సైనా 22వ, శ్రీకాంత్‌ 26వ ర్యాంకుల్లో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles