Visitors Keen To Seal Off An Unbeatable Lead విజేతల సంబరాల్లో ఇటు చిందులు అటు ఉద్రిక్తత..

French players crash press conference to celebrate world cup triumph

Mario Mandzukic, Paul Pogba, Kylian Mbappe, Luzhniki Stadium, Moscow, russia, 2018 FIFA WORLD CUP, FIFA WORLD CUP, sports news,sports, latest sports news, cricket news, cricket

Two people died as millions took to the streets to celebrate France's World Cup win over Croatia, a 50-yr-old man died In the southeast city of Annecy and a man in his thirties died after crashing his car into a tree in the northern town of Saint-Felix while celebrating the team's triumph.

ఫీఫా వరల్డ్ కప్ సంబరాల్లో ఇటు చిందులు అటు ఉద్రిక్తత..

Posted: 07/16/2018 04:16 PM IST
French players crash press conference to celebrate world cup triumph

రష్యా వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్ లో ఫ్రాన్స్‌ 4-2 తేడాతో క్రొయేషియాపై విజయం సాధించంతో రెండో పర్యాయం విజేత నిలిచిన జాబితాలోకి ఫ్రాన్స్ చేరిపోయింది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. ఏకంగా మీడియా సమావేశంలో తమ అనందాన్ని పాటలు పాడుతూ గెంటుతూ చిందులు వేస్తూ ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్‌లు నిబంధనల ప్రకారం మీడియా సమావేశంలో పాల్గొనాల్సి వుంది.

ఈ నిబంధన మేరకు రెండు జట్ల కోచ్ లు అసీనులై వుండగా.. సమావేశంలో ఫ్రాన్స్‌ జట్టు కోచ్‌ డిడియర్‌ డెషాంప్స్‌ మాట్లాడేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఆ జట్టు ఆటగాళ్లు షాంపైన్‌ చల్లుకుంటూ సందడి చేస్తూ కనిపించారు. టేబుళ్లు‌ ఎక్కి చిందులు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఫ్రాన్స్‌ ప్రపంచకప్‌ గెలవడం ఇది రెండోసారి.
1998లో డెషాంప్స్‌ నాయకత్వంలోనే ఫ్రాన్స్‌ తొలిసారి ప్రపంచకప్‌ గెలుచుకుంది.

తిరిగి సరిగ్గా ఇరవై ఏళ్లకు డెషాంప్ప్‌ కోచ్‌గా వ్యవహరించిన ఫ్రాన్స్‌ జట్టు మరోసారి విజేతగా నిలిచింది. ఒక జట్టుకు కెప్టెన్‌గా అదే జట్టుకు కోచ్‌గా వ్యవహరించి ప్రపంచకప్‌ను ముద్దాడిన మూడోవాడు డెషాంప్స్‌. 2016 యూరో ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోర్చుగల్‌ చేతిలో ఓటమి నుంచి చాలా నేర్చుకున్నామని, ఆ రోజు ఓడిపోకపోయుంటే ఈ రోజు విశ్వ విజేతలుగా నిలిచేవాళ్లం కాదేమో అని డెషాంప్స్‌ అన్నాడు. ఇదిలావుండగా వరల్డ్ కప్ గెలిచిన సంబరాల్లో అటు విషాదం కూడా చోటుచేసుకుంది.

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో చాంప్స్ ఎలిసెస్‌ అవెన్యూ వద్దకు వేలాదిగా చేరుకున్న అభిమానులు సంబరాలు జరుపుకుంటూ రోడ్డపై వున్న చెత్త బుట్టలకు నిప్పు పెట్టారు. వారిని నివారించే ప్రయత్నం చేసిన పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో సంబరాల వేడుక కాస్తా ఉద్రిక్తంగా మారిపోయింది. కొందరు ఆకతాయిలు వారిపైకి రాళ్లు, బాటిళ్లు విసిరారు. ముఖాలకు ముసుగు ధరించిన కొందరు స్థానకింగా వున్నదుకాణాల్లో లూఠీలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు భాష్పవాయు గోళాలు, వాటర్ క్యానాన్లను ప్రయోగించారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ నడివయస్క్సుడితో పాటు ఓ యువకుడు కూడా మృతిచెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : France  Paris  World Cup 2018  World  FIFA  Croatia  football  sports  

Other Articles