Hima Das storms into 400m final at U-20 Worlds భారత స్పింటర్ హిమపై ప్రశంసల జల్లు

Wishes pour in after hima das wins gold makes history

hima das,Jisna Mathew,International Association of Athletics Federations,IAAF World Under-20 Athletics Championships,Ashish Jakhar, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Assam’s Hima Das created history by winning the gold medal in the women's 400-metre event at the IAAF World U-20 Championships held at Tampere, Finland.

స్వర్ణంతో మెరిసిన భారత స్పింటర్ హిమపై ప్రశంసల జల్లు

Posted: 07/13/2018 04:08 PM IST
Wishes pour in after hima das wins gold makes history

భారత స్పింటర్ హిమ దాస్ స్వర్ణ పతకంతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్‌ వేదికగా జరిగిన ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన హిమ దాస్‌.. 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారత అథ్లెట్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో బంగారు పతకం గెలుపొందడం ఇదే తొలిసారి. అస్సాంకి చెందిన 18 ఏళ్ల హిమ దాస్ ఫైనల్లో 400మీ పరుగుని కేవలం 51.46 సెకన్లలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

ఆమె తర్వాత స్థానంలో రొమేనియా అథ్లెట్ మిక్లో 52.07 సెకన్ల‌తో రజతం గెలవగా.. అమెరికాకి చెందిన టేలర్ మన్సన్ 52.28 సెకన్లతో కాంస్యానికి పరిమితమైంది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో 52.10 సెకన్లలో 400మీ పరుగును పూర్తి చేసిన హిమ దాస్.. మంగళవారం జరిగిన మొదటి రౌండ్‌లో 52.25 సెకన్లు తీసుకోవడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌‌లో 400మీ పరుగుని 51.32 సెకన్లలో పూర్తి చేసిన హిమ దాస్ ఫైనల్లో ఆరోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

కాగా, హిమదాస్ అద్భుత ప్రతిభతో చరిత్రను సృష్టించిన నేపథ్యంలో అమెపై ప్రశంసల జల్లు కురుస్తుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ, విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు కేంద్రమంత్రులు, మాజీ కేంద్రమంత్రులు, సెలబ్రిటీలు, సినిమా ప్రముఖులు అమెకు అభినందనలు తెలిపారు. అసాధారణమైన ప్రతిభతో స్వర్ణపతకాన్ని అందుకున్న హిమపై అటు నెట్ జనులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles