OP Jaisha hospitalised after testing positive for swine flu

Coach iaaf dismiss op jaisha claims

OP Jaisha, marathon, swine flu, rio olympics, Kavita Raut, coach Nikolai Snesarev, International Amateur Athletics Federation (IAAF), Olympics 2016, India, Rio Olympics, Rio 2016, Rio Olympics 2016, olympics news

WFI President Brij Bhushan Sharan Singh demanded a CBI probe into the "alleged conspiracy" against Narsingh Yadav, which led to a four-year ban on the grappler.

జైషా అరోపణలను ఖండించిన కోచ్, ఐఏఏఎఫ్

Posted: 08/26/2016 09:47 PM IST
Coach iaaf dismiss op jaisha claims

తనకు రియో ఒలింపిక్స్ మారథాన్ రన్లో కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని భారత మహిళా అథ్లెట్ ఓపీ జైశా చేసిన అరోపణలను సంబంధిత అధికారులు తోసిపుచ్చారు. జైఫా చేసిన అరోపణలు అవాస్తవమని అమె సహచరి కవిత కౌర్ కూడా స్పష్టం చేశారు, జైషా అరోపణలను టీమిండియా కోచ్ నికోలై స్నేసరేవ్ సహా అంతర్జాతీయ అమెర్చూర్ అథ్లెటిక్ పెడరేషన్ అధికారులు కూడా సత్యదూరమని చెప్పారు. స్వ్లైన్ ఫ్లూ బారిన పడింది. రియో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం భారత్ కు వచ్చిన జైశా అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు బెంగళూరులోని  ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. దీనిలో భాగంగా జైశాకు నిర్వహించిన పరీక్షల్లో స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్దారణ అయ్యింది. జైశా ఆరోగ్యంపై స్పోర్ట్స్ అథారిటీ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ డా. ఎస్ సరళ స్పందించారు.
 
అథ్లెట్ జైశాకు స్వైన్ జాతికి చెందిన హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు పేర్కొన్నారు. జైశా ఆరోగ్యంపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, రియో ఒలింపిక్స్ అనంతరం పలువుర భారత అథ్లెట్లు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో కొంతమంది చికిత్స అనంతరం ఇంటికి చేరగా, స్టీపుల్ చేజ్ క్రీడాకారిణి సుధాకు జికా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సుధాకు బెంగుళూరులోని స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్లో చికిత్స అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : OP Jaisha  marathon  swine flu  rio olympics  

Other Articles