Wrestler Sushil Kumar moves court seeking trial for Rio Olympics berth

Sushil kumar vs narsingh yadav bitter wrestling match in court now

Sushil Kumar, Narsingh Pancham Yadav, sushil kumar high court, high court sushil kumar, sushil, sushil vs narsingh, narsingh vs sushil, narsingh yadav, 2016 Rio Olympic Games, Wrestling Federation of India, Rio Preparatory camp, Sonepat, WFI, Sports Ministry, sports news

Sushil Kumar moved Delhi High Court with a plea to direct WFI to conduct a selection trial for Rio Olympics 2016.

సుశీల్ కుమార్ బెర్తుపై క్లారీటీ ఇచ్చిన భారత రెజ్లింగ్ ఫెడరేషన్

Posted: 05/16/2016 10:05 PM IST
Sushil kumar vs narsingh yadav bitter wrestling match in court now

రియో ఒలింపిక్స్ బెర్తును ఆశించిన భారత రెజ్లర్ సుశీల్ కుమార్ తాను రియో ఒలంపిక్స్ వెళ్లేందుకు మిగిలి వున్న ఏ మార్గాన్ని వదులుకోదల్చుకోలేదు. అందుకనే ఆయన తన చివరి ప్రయత్నంగా మిగిలిన ఏకైక మార్గం న్యాయస్థానమనే భావిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని భావిస్తున్నారు, రియో ఒలంపిక్స్ బెర్త్ విషయంలో నర్సింగ్ యాదవ్ కు తనకు మధ్య చోటు చేసుకున్న గొడవ ఇప్పట్లో సమసిపోయేలా లేదు. తాజాగా రెజ్లర్ నర్సింగ్ యాదవ్ను 74 కేజీల విభాగంలో రియో సన్నాహక శిబిరానికి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్యూఎఫ్ఐ) ఎంపిక చేయడంతో వివాదం మరింత తారస్థాయికి చేరింది.

బుధవారం నుంచి  హరియాణాలోని సోన్పేట్లో భారత రెజ్లింగ్ రియో సన్నాహకాల్లో  ఆరంభమవుతున్న నేపథ్యంలో నర్సింగ్ యాదవ్ పేరును డబ్యూఎఫ్ఐ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సుశీల్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తమలో ఎవరు భారత్కు ప్రాతినిథ్యం వహించాలో తేల్చాలంటూ కోర్టును కోరాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పతకం, 2012 లండన్ ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సుశీల్.. ట్రయల్ ఆధారంగానే  తుది ఎంపిక జరగాలని పట్టుబడుతున్నాడు.

వాస్తవానికి  రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో పాల్గొంటామని ఇద్దరు రెజ్లర్లు సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ లు పోటీ పడ్డారు. భారత్ తరపున ఈ కేటగిరిలో సుశీల్ (ఢిల్లీ), నర్సింగ్ (ముంబై) అత్యుత్తమ రెజ్లర్లు కాగా, కేవలం ఒకరికి మాత్రమే ఒలింపిక్ బెర్త్ దక్కుతుంది.   గతేడాది లాస్‌వేగాస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నర్సింగ్ యాదవ్ 74 కేజీల విభాగంలో కాంస్యం పతకం సాధించాడు.

దీంతో పాటు టాప్-6లో నిలిచి భారత్ కు ఆ కేటగిరీలో ఒలింపిక్ బెర్త్‌ను అందించాడు. ఆ ఈవెంట్‌కు వెళ్లాల్సిన సుశీల్ గాయం కారణంగా తప్పుకోవడంతో నర్సింగ్ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్నాడు. ఒకసారి ఒక దేశానికి బెర్త్ దక్కాక... మరో క్రీడాకారుడు ఒలింపిక్ బెర్త్ కోసం పోటీపడకూడదు. గతంలో భారత్ కు ప్రాతినిధ్యం వహించడంతో పాటు పతకాలు తెచ్చానని తనకు ఈసారి మరో అవకావం ఇవ్వాలని సుశీల్ కోరుతున్నాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushil Kumar  Wrestling  RIO olympics  Narsingh Yadav  

Other Articles