Max Verstappen makes F1 history becomes youngest ever winner at 18

Max verstappen finds his spanish gp f1 victory hard to believe

max verstappen, formula one history, f1 history, f1 record, f1 youngest race winner, spanish grand prix, mercedes, lewis hamilton, nico rosberg

Teenager Max Verstappen has made positioned himself as the fastest rising star in one of the world’s richest sports with a remarkable win in Spanish Grand Prix,

ఫారులావన్ లోకి యువకెరటం రికార్డు..

Posted: 05/16/2016 05:18 PM IST
Max verstappen finds his spanish gp f1 victory hard to believe

ప్రపంచ ఫార్ములావన్ చరిత్రలో ఓ యువ కెరటం దూసుకొచ్చింది ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రిలో 18 ఏళ్ల మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్ బుల్) విజేతగా అవతరించాడు. తద్వారా  అత్యంత పిన్నవయసులో ఫార్ములావన్ టైటిల్ను కైవసం చేసుకున్న డ్రైవర్గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 66 ల్యాప్ల ప్రధాన రేసును ఒక గంటా 41నిమిషాల 40.017సెకన్లలో పూర్తి చేసిన వెర్స్టాపెన్ అగ్రస్థానంలో నిలిచి తొలి ఫార్ములావన్ టైటిల్ ను అందుకున్నాడు.

ఈ రేసును తొలి రెండు స్థానాల నుంచి ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హమిల్టన్, నికో రోస్ బర్గ్లకు ఆదిలోనే చుక్కెదురైంది. మొదటి ల్యాప్లో ఇద్దరి కార్లు ఢీకొనడంతో వారు రేసు నుంచి వైదొలిగాల్సి వచ్చింది. ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించిన హమిల్టన్ను రోస్ బర్గ్ అధిగమించాడు. దీంతో ఆధిక్యంలోకి వెళ్లదామని హమిల్టన్ మరోసారి ప్రయత్నించే క్రమంలో రోస్ బర్గ్ కారును ఢీకొట్టాడు. దీంతో వారిద్దరూ రేసు మధ్యలోనే వైదొలిగారు. దీన్ని మ్యాక్స్ వెర్స్టాపెన్ సద్వినియోగం చేసుకుని విజేతగా నిలిచాడు. మాజీ ఫార్ములా వన్ డ్రైవర్ జాస్ వెర్స్టాపెన్ కుమారుడైన మ్యాక్స్ .. ఫార్ములావన్ టైటిల్ గెలిచిన తొలి డచ్ డ్రైవర్ గా చరిత్ర సృష్టించడం మరో విశేషం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles