Vijender Singh blows away Andrzej Soldra, wins sixth straight pro fight

Sixth straight win for boxer vijender singh in pro fight

Boxer Vijender Singh, andrej Soldra, vijender singh fight, vijender singh bout, vijender singh pro bout, vijender singh pro fight, andrzej soldra, Poland, India, Knock-out method

Vijender Singh wins again: The result means he stays unbeaten in Pro Boxing and has won all his bouts by a knockout.

అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తున్న బాక్సర్ విజేందర్ సింగ్

Posted: 05/14/2016 06:18 PM IST
Sixth straight win for boxer vijender singh in pro fight

భారత ప్రొఫెషనల్ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ తన జైత్రయాత్రను అప్రతిహాతంగా కొనసాగిస్తున్నాడు. వేదిక ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా పదునైన పంచ్‌లతో హడలెత్తిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ప్రత్యర్థులు మాటల తూటాలతో విసురుతున్న సవాళ్లను తన పవర్ పంచులతో బదులిస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. ఆంద్రెజ్ సోల్డ్రా (పోలండ్)తో జరిగిన బౌట్‌లో విజేందర్ సింగ్ టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత ఎనిమిది రౌండ్‌లపాటు జరగాల్సిన బౌట్ విజేందర్ ధాటికి ముచ్చటగా మూడో రౌండ్‌లోనే ముగిసింది.

విజేందర్ సింగ్ సంధించిన పంచ్‌లకు సోల్డ్రా ఎదురు నిలువలేకపోవడంతో రిఫరీ బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. దాంతో విజేందర్ తన ప్రొఫెషనల్ కెరీర్‌లో వరుసగా ఆరో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఆరు బౌట్‌లలో విజేందర్ తన ప్రత్యర్థులను నాకౌట్ చేయడం విశేషం. విజేందర్‌కు షాక్ ఇస్తానని, అతని ఎముకలు విరిచి భారత్ కు పంపిస్తానని.. బౌట్‌కు ముందు ప్రగల్భాలు పలికినా సోల్డ్రా రింగ్‌లోకి దిగాక చేతులెత్తేశాడు. ఆరంభం నుంచే విజేందర్ పంచ్‌లు విసరడంతో తొలి రౌండ్‌లోనే ఒకసారి సోల్డ్రా కుప్పకూలిపోయాడు. రెండో రౌండ్‌లోనూ విజేందర్ తన దూకుడు కనబరిచాడు. ఇక మూడో రౌండ్‌లో విజేందర్ పంచ్‌ల వర్షం కురిపించడంతో సోల్డ్రా ఓటమిని అంగీకరించాడు.

అరో విజయాన్ని అందుకున్న తరువాత విజేందర్ సింగ్ మాట్లాడుతూ ఈ విజయంతో తాను ధ్రిల్ అయ్యానని చెపుకోచ్చాడు. ఆరో బౌట్ లో విజయం సాధించడం తన ప్రొఫెషనల్ బాక్సర్ గా రాణించేందుకు మరింత దోహదపడిందన్నాడు, సోల్డ్రా మంచి ప్రత్యర్థి అని అన్న విజేందర్.. అతని తన పంచ్ పవర్ ధీటుగానే బదులిచ్చిందని పేర్కోన్నాడు. తనతో జరిగిన బౌట్ ప్రత్యర్థి పాలిట హారర్ షోగా నిలుస్తుందన్నాడు. ఎనమిది రౌండ్లతో కూడిన తొలి బౌట్ లో విజయసాధించడంతో తనలో టైటిల్ సాధించగలనన్నా నమ్మకాన్ని పెంచాయన్నాడు, కాగా తనకు ఈ పోటీలో మద్దతుగా నిలిచిన యూకే వాసులతో పాటు భారతీయులకు కూడా ఆయన ధన్యవాదాలు చెప్పాడు, టైటిల్ ఫోరు కోసం తాను భారత్ లో శ్రమిస్తానని విజేందర్ చెప్పాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Boxer Vijender Singh  andrej Soldra  Poland  India  Knock-out method  

Other Articles