Wrestler Sushil Kumar may move court for Rio Olympics berth

Sushil kumar not dropped from rio list claims wrestling federation of india

sushil kumar, sushil, narsingh yadav, narsingh, sushil vs narsingh, narsingh sushil, narsingh sushil olympics, sushil narsingh 2016 olympics, 2016 rio olympics, Rio 2016, Wrestling Olympic trials, Rio Games 2016

Sushil Kumar plans to take his Olympic ticket hunt all the way to court with the Wrestling Federation of India, making it clear it is not in favour of his demand for a selection trial.

రియో ఒలంపిక్స్ జాబితా సుశీల్ ను తప్పించలేదు..

Posted: 05/13/2016 02:10 PM IST
Sushil kumar not dropped from rio list claims wrestling federation of india

గతంలో జరిగిన పలు ఒలంపిక్స్ క్రీడలలో భారత్ దేశానికి పతకాలను పంటను పండించిన రెజ్లర్ సుశీల్ కుమార్ కు రియో ఒలింపిక్స్ వెళ్లేందుకు మొండిచేయి చూపారని వచ్చిన వార్తలను భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) తోసిపుచ్చింది. ఒలింపిక్స్ ప్రాబబుల్స్ కు తాము ఎటువంటి జాబితా పంపించలేదని స్పష్టం చేసింది. రియో ఒలింపిక్స్ జాబితా నుంచి సుశీల్ కుమార్ ను తప్పించలేదని తెలిపింది. రియో ఒలింపిక్స్ ప్రాబబుల్స్ లో రెజ్లింగ్‌లో 74 కేజీల విభాగంలో సుశీల్ కు చోటు దక్కలేదని, నర్సింగ్ యాదవ్ వైపు రెజ్లింగ్ సమాఖ్య మొగ్గు చూపిందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.

అయితే భారత్ ఒలింపిక్స్ సంఘానికి తాము ఎటువంటి జాబితా పంపించలేదని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ శరణ్ సింగ్ తెలిపారు. ఒలింపిక్స్ లో వివిధ కేటగిరీల్లో పోటీ పడే అవకాశమున్న క్రీడాకారుల పేర్ల జాబితాను అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనే సంస్థ పంపిస్తుంటుందని వివరణయిచ్చారు. సుశీల్ కుమార్ కు దారులు పూర్తిగా మూసుకుపోలేదన్నారు. భారత్ ఒలింపిక్స్ సంఘం ఎవరి పేరుకు ఖరారు చేస్తే వారే దేశం తరపున పోటీకి వెళతారని డబ్ల్యూఎఫ్ఐ సహ కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు.

అయితే తన పేరును రియో ఒలంపిక్స్ లో పరిశీలనకు పంపలేదన్న వార్తలను అటుంచిన సుశీల్ కుమార్.. తనకు ఒలంపిక్స్ లో స్థానం కల్పించాలని కోరుతూ న్యాయపోరాటం చేయనున్నారు. తన రికార్డులను పరిశీలించి తనకు రియో ఒలంపిక్స్ లో అర్హతను కల్పించాలని ఆయన న్యాయస్థానాన్ని అశ్రయించనున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయనున్నారని సమాచారం. అయితే ఇది తమ ముందు కనబడిన ఒక మార్గమని, అంతుకుముందే సమస్య పరిష్కారం కాగలదన్న నమ్మాకాన్ని సుశీల్ వ్యక్తం చేశారు.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles