PV Sindhu wins Malaysia Masters Grand Prix title

Pv sindhu wins malaysia masters grand prix title

PV Sindhu , Malaysia Masters Grand Prix title , Malaysia Masters Grand Prix , Kristy

Two-time World Championship bronze-medallist, India's P V Sindhu made a rousing start to the new season as she clinched the Malaysia Masters Grand Prix Gold title after defeating Scotland's Kristy Gilmour in straight games in the final here .The Third seeded Indian had lost to Gilmour in 2013 French Open in their only meeting but she showed why she is considered to be one of India's most revered women's singles shuttler as she avenged her loss with a dominating 21-15 21-9 win in a 32-minute clash to clinch her fifth Grand Prix Gold title.

మలేసియా మాస్టర్స్ ఛాంపియన్ గా పి.వి సింధూ

Posted: 01/25/2016 05:57 PM IST
Pv sindhu wins malaysia masters grand prix title

పీవీ సింధు  మరోసారి సత్తాచాటింది. మకావు ఓపెన్ హ్యాట్రిక్ టైటిల్‌ తో గతేడాదిని గ్రాండ్‌గా ముగించిన ఈ హైదరాబాదీ ఏస్..తాజాగా మలేసియా మాస్టర్స్‌లో చాంపియన్‌గా నిలిచి ఈ సీజన్‌కూ ఘనంగా స్వాగతం పలికింది. రెండోసారి ఈ టైటిల్‌ను కొల్లగొట్టిన సింధు ఓవరాల్‌గా కెరీర్‌లో ఐదో గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్‌ను అందుకుంది. సెమీస్‌లో టాప్‌ సీడ్ సంగ్ జీ హ్యూన్‌ను చిత్తుచేసిన సింధు ఫైనల్లోనూ అంతేదీటుగా విజృంభించింది. ప్రత్యర్థి క్రిస్టీ గిల్మోర్‌కు అవకాశమివ్వకుండా అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ముఫ్పై రెండు నిమిషాల పాటు సాగిన ఏకపక్ష పోరులో మూడోసీడ్ సింధు పదునైన స్మాష్‌లకు తోడు దీటైన నెట్‌గేమ్‌తో చెలరేగింది. తొలిగేమ్‌లో ఓ మోస్తరు పోటీనిచ్చినట్లు కనిపించిన గిల్మోర్, రెండోగేమ్‌లో మాత్రం సింధు ధాటికి ఏ దశలోనూ నిలవలేకపోయింది.

ఇది తనకు అద్భుత విజయం అని... ఈ సీజన్‌కు గొప్ప ప్రారంభం అని సింధూ ఆనందం వ్యక్తం చేసింది.  టోర్నీ ఆద్యంతం బాగానే ఆడానని..  అందుకే ఫైనల్‌ కు ముందు కూడా ఒత్తిడికి గురవలేదని వెల్లడించింది.  అయితే, ఫైనల్ ఇంత సులువుగా నెగ్గుతానని అనుకోలేదని.. . ప్రత్యర్థి క్రిస్టీ గిల్మోర్ గతంలో నన్ను ఓసారి ఓడించిందని. దాంతో హోరాహోరీ తప్పదనుకున్నానని తెలిపింది.  ఏదేమైనా, సీజన్ ప్రారంభంలోనే టైటిల్ నెగ్గడం తనకు ఆత్మవిశ్వాసాన్నిచ్చిందని వెల్లడించింది.  తర్వాతి టోర్నీలైన సయ్యద్ మోడీ గ్రాండ్ ప్రీ, ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది అని సింధూ ధీమా వ్యక్తం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Malaysia Masters Grand Prix title  Malaysia Masters Grand Prix  Kristy  

Other Articles