Indian village boy, 11, seeks glory on world golf stage

Indian village boy seeks glory in world golf

India's No. 1 junior golfer Shubham Jaglan, junior world golf championship winner Shubham Jaglan, Shubham Jaglan, Jagpal Jaglan, Nonita Lal Qureshi, former golfer Amit Luthra, Spanish legend Seve Ballesteros, US Masters, Anirban Lahiri, veteran Jeev Milkha Singh, Arjun Atwal.

Jaglan has stunned his family and village since picking up a club at the age of just five, winning back-to-back junior titles in the US in 2015 and finishing sixth in an international event there for youngsters.

గోల్ఫ్ ఏకలవ్యుడు ఛాంఫియన్ అయ్యాడు

Posted: 01/21/2016 06:50 PM IST
Indian village boy seeks glory in world golf

భారతదేశానికి చెందని ఓ 11 ఏళ్ల బాలుడు యూఎస్ గోల్ఫ్ జూనియర్ టైటిల్‌ను సాధించాడు. అంతటితో ఆగకుండా మాస్టర్ టైటిల్‌ను తప్పకుండా సాధిస్తానని చెబుతున్నాడు. హర్యానాలోని ఇస్రానా గ్రామానికి చెందిన శుభమ్ జగ్లాన్ అమెరికాలో దేశ ప్రతిష్ఠను మరింత పెంచాడు. అందరి సహకారంతో తాను గోల్ఫ్ జూనియర్ టైటిల్‌ను గెలిచాననీ జగ్లావ్ వ్యాఖ్యనించాడు. ఇకముందు కూడా సొంత ఊరిలోనే ఉంటానన్నాడు. భవిష్యత్తులో మాస్టర్ టైటిల్‌ను కూడా గెలుస్తానని జగ్లావ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

తన ఊరికి దగ్గరలోని గోల్ఫ్ శిక్షణ ఇస్తుండటంతో.. ఆ ఆట ఏమిటో తెలియకపోయినా ఏకలవ్యుడిగా నేర్చుకుంటున్న వారిని చూసి తాను ప్రాక్టీస్ చేసాడుడు. ఆటపై కుమారుడికి ఉన్న ఆసక్తిని చూసిన తండ్రి జగపాల్ జగ్లాన్ తన పొలంలోనే మైదానాన్ని ఏర్పాటు చేశాడు. ఆటపై కుమారుడి ఆసక్తిని చూసి ఆటకి సంబంధించిన వస్తువులు తన తండ్రి సమకూర్చడంతో జగపాల్ ఆసక్తిని మరింత పెంచింది.
తన తోటి వారిని కూడా ఆటలోకి తీసుకుని గోల్ఫ్ నేర్పించి ఆ పరిసరాల్లోనే టోర్నమెంట్స్‌ను నడిపాడు.

ఈ విషయాన్ని తెలసుకున్న ఢిల్లీలోని గోల్ఫ్ క్రీడాకారిణి నోనిటా లాల్ ఖురేషి.. జగ్లాన్‌ని వెతుక్కుంటూ ఇస్రానా గ్రామానికి వెళ్లింది. అయితే జగ్లాన్ ఆటతీరు తో సంతోషాన్ని వ్యక్తం చేసిన అమె.. జాతీయ స్థాయి టోర్నమెంట్లకు అది సరిపోదని..  ఢిల్లీకి తీసుకుని వెళ్లి గోల్ఫ్లో మెలకువలు నేర్పించింది. స్పోర్ట్ ఛారిటీని నడుపుతున్న గోల్ఫ్ క్రీడాకారుడు అమిత్ లుతారా జగ్లావ్‌కు ఢిల్లీలో నివసించడానికి సహాయం చేశారు. ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ జగ్లాన్‌కు ఉచితంగా మెంబర్‌షిప్‌ను కల్పించింది. దీంతోపాటు ఓ పబ్లిక్ స్కూలు అతడి ట్యూషన్ ఫీజును రద్దు చేసింది. చారిటీనే యూఎస్‌కి వెళ్లడానికయిన ఖర్చును భరించింది. వారందరి సహకారంతో తాను గోల్ఫ్ జూనియర్ టైటిల్‌ను గెలిచాననీ జగ్లావ్ వ్యాఖ్యనించాడు. ఇకముందు కూడా సొంత ఊరిలోనే ఉంటానన్నాడు. భవిష్యత్తులో మాస్టర్ టైటిల్‌ను కూడా గెలుస్తానని జగ్లావ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. జగ్లావ్ అనుకున్నది సాధిస్తాడని ఖురేషీ వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shubham Jaglan  junior world golf champion  America  Nonita Lal Qureshi  Jagpal Jaglan  

Other Articles