Cristiano Ronaldo caught urinating in the street following night of partying in Saint Tropez

Cristiano ronaldo caught urinating in the street

Cristiano Ronaldo news, Cristiano Ronaldo career, Cristiano Ronaldo controversy, Cristiano Ronaldo urinating, Cristiano Ronaldo crime, Cristiano Ronaldo girlfriends

Cristiano Ronaldo caught urinating in the street : The 30-year-old footballer was spotted leaving Saint Tropez's exclusive club Le Quai in the early hours of Monday, before using the street as the toilet, with his actions drawing the attention of the police who immediately gave him a stern talking to.

‘సూసూ’ పోశాడు.. చీవాట్లు కొనితెచ్చుకున్నాడు!

Posted: 06/04/2015 03:10 PM IST
Cristiano ronaldo caught urinating in the street

ఎవరి పేరు చెబితే ఫుట్ బాల్ అభిమానులు ఎగిరి గంతేస్తారో.. ఎవరి ఫోటో చూపిస్తే దాన్ని అందుకోవడం కోసం అమ్మాయిలు పడి చచ్చిపోతారో.. ఎవరి ప్రస్తావన వస్తే ప్రత్యర్థి గుండెల్లో గుబులు పుట్టుకొస్తుందో.. అతడే రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ క్రిస్డియానో రొనాల్డో. ఫుట్ బాల్ క్రీడలో తన ప్రతిభతో చెరగని ముద్ర వేసుకున్న ఈ ఆటగాడిని ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఇంతటి పాపులారిటీ పొందిన ఈ ఆటగాడు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చీవాట్లు తింటున్నాడు. ఎందుకో తెలుసా..? సఖ్యత కోల్పోయి నడిరోడ్డుపై బహిరంగ మూత్ర విసర్జన చేసి ‘ఛీ’ కొట్టించుకుంటున్నాడు. ఈ ఘటన సెయిండ్ ట్రోపెల్ లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రొనాల్డో తన స్నేహితులతో కలిసి తెల్లవారుజాము వరకూ పార్టీ చేసుకున్నాడు. రాత్రంతా తాగుతూ, డ్యాన్సులో వేస్తూ మస్తుగా ఎంజాయ్ చేసిండు. ఆ మత్తులోనే మనోడు నేరుగా బయటకు వచ్చి.. నడిరోడ్డుపై బహిరంగ మూత్ర విసర్జన చేసేశాడు. సెయింట్ ట్రోపెజ్ లో ఓల్డ్ హార్బర్ ఏరియాలోని ఓ ఐస్ క్రీం షాపు ముందు ఈ ఫుట్ బాలర్ ఈ పని కానిచ్చేశాడు. ఈ ఉదంతాన్ని కొందరు ఫోటోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లో పెట్టేశారు. దీంతో.. అతడు చేసిన ఈ పని పట్ల తీవ్ర నిరసన వ్యక్తమైంది. అతని వీరాభిమానులు సైతం తిట్లపురాణాన్ని సంధించేశారు. చివరికి ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. రొనాల్డోకు వార్నింగ్ ఇచ్చే వదిలేశారని సమాచారం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cristiano Ronaldo  FootBall  

Other Articles