saina kashyap in indonesia open pre quarters sindhu loses

Saina kashyap advance sindhu ousted from indonesian open

Indonesian Open badminton championship, Indonesian Open 2015, Saina Nehwal, P.V. Sindhu, sport, badminton news, Indonesia Open, pre-quarters, Saina nehwal, Parupalli Kashyap

World number one Saina Nehwal disposed off Thai Nichaon Jindapon’s challenge in straight games but P.V. Sindhu crashed out of the Indonesian Open Super Series badminton tournament following a close first-round defeat, in Jakarta on Wednesday.

ఇండోనేషియా ఓపెన్: ప్రీ క్వాటర్ట్స్ లోకి దూసుకెళ్లిన సైనా, కశ్యప్

Posted: 06/03/2015 06:33 PM IST
Saina kashyap advance sindhu ousted from indonesian open

ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకు క్రీడాకారిణి, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇండోనేషియా ఓపెన్ లో దూసుకెళ్తోంది. ఈ టోర్నమెంటులో జరుగుతున్న మహిళల సింగిల్స్ విభాగంలో సైనా ప్రిక్వార్టర్స్ లో ప్రవేశించింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో థాయ్లాండ్ కి చెందిన నిచాన్ జిందాపొన్పై 21-16, 21-18 తేడాతో విజయం సాధించింది. తొలిసెట్ ను సులువుగా కైవసం చేసుకున్న సైనాకు రెండోసెట్ లో కొంత ప్రతిఘటన ఎదురైంది. ఓ దశలో 18-17 తో వెనకబడి ఉన్న సైనా వరుసగా నాలుగు పాయింట్లు తన ఖాతాలో వేసుకొని కేవంల 35 నిమిషాలలో విజయం సాధించింది. 2009, 2010, 2012 సంవత్సరాలలో సైనా ఇండోనేషియా ఓపెన్ నెగ్గిన విషయం తెలిసిందే.

ఆటు ప్రపంచ 14వ ర్యాంకులో కోనసాగుతున్న హైదరాబాదీ షెట్లర్ పి.వి.సిందూ ఇంటి దారి పట్టింది. గత కోన్ని రోజులుగా అమె మెరుగైన ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమవుతుంది. పి.వి.సిందూ.. చైనాకు చెందిన క్రీడాకారిణి హు యా చింగ్ చేతిలో ఓటమిపాలైంది. 21-15, 21- 14 తేడాతో వరస సెట్లు కోల్పోయి కేవలం 49 నిమిషాల పాటు పోరాడి.. ఓటమిని చవిచూసి.. ఇంటిదారి పట్టింది. దీంతో ఇండోనేషియా ఓపెన్ లో తన సత్తా చాటుతుందనుకున్న అభిమానులు అంచానాలను తారుమారు చేసిన సింధూ..ఈ ఓటమితో ఇంటిదారి పట్టింది.

కాగా, పురుషుల కేటగిరిలో పారుపల్లి కశ్యప్ సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్ కి దూసుకెళ్లాడు. పారుపల్లి కశ్యప్ 21-17, 21-7 తేడాతో వరుస సెట్లను కైవసం చేసుకొని థాయ్లాండ్ కి చెందిన టనొంగ్ సాక్ పై విజయం సాధించాడు. ఈ రెండు సెట్లను కేవలం 29 నిమిషాల్లోనే ముగించడం విశేషం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indonesia Open  pre-quarters  Saina nehwal  Parupalli Kashyap  

Other Articles