8 year old boy Devisri Prasad steals the show in limbo skating

8 year old boy devisri prasad steals the show limbo skating

Devisri Prasad limbo skating, Devisri Prasad 8 year boy, limbo skating children, Devisri Prasad tirupati boy, skating champion, Sri Venkateswara University

8 year old boy Devisri Prasad steals the show limbo skating : Devisri Prasad performed limbo skating under 50 closely-parked cars. Crowd thronged the road between Sri Venkateswara University and SV Vedic University to watch him perform. A national and international inline skating champion for 2014-15 in the Under-8 category, the boy covered a distance of 102.47 metres in less than 15 seconds.

బుడ్డోడే కదా అనుకుంటే.. రికార్డులు బద్ధలుకొట్టాడు!

Posted: 04/30/2015 11:32 AM IST
8 year old boy devisri prasad steals the show limbo skating

ఇటీవలే కాలంలో పెద్దలకు సవాల్ విసురుతూ పిల్లలు కూడా సాహసకృత్యాలు చేయడంలో దూసుకుపోతున్నారు. ఏమాత్రం భయం లేకుండా సమర్థవంతంగా, మనోధైర్యంతో సాహసకార్యాల్లో పాల్గొని.. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈ తరహాలోనే తాజాగా మరో బుడ్డోడు తన విన్యాసాలతో అబ్బురపరిచి.. కొత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. 50 సుమోల కింద లింబో స్కేటింగ్ చేసి తన సత్తా చాటుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన ఎనిమిదేళ్ల గండువల్లి దేవీశ్రీప్రసాద్.. లింబో స్కేటింగ్ లో ప్రపంచ రికార్డును బద్ధలు కొట్టి ఔరా అనిపించాడు. బుధవారం తిరుపతిలో వేదిక్ వర్సిటీ ప్రాంగణం వేదికగా అతను ఈ ఫీట్ చేశాడు. ఫార్వర్డ్ విభాగం ప్రదర్శనలో 50 సుమోల కిందుగా 103.7 మీటర్ల దూరాన్ని కేవలం 19.27 సెకండల్లలోనే దేవీశ్రీ చేరుకుని వరల్డ్ రికార్డును అధిగమించాడు. అలాగే బ్యాక్ వర్డ్ విభాగంలో అతను తొలిప్రయత్నంలోనే 26 సుమోల కిందుగా 53.8 మీటర్ల దూరాన్ని 27.98 సెకండ్లలో చేరుకుని.. సరికొత్త రికార్డును సృష్టించాడు. గతేడాది ఐజెక్ హెన్నీ (చెన్నై) ఫార్వర్డ్ విభాగంలో 45 సుమోల కిందుగా గమ్యాన్ని 27.4 సెకండ్లలో చేరుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్నాడు. అయితే.. దేవీశ్రీ తన ప్రదర్శనతో ఆ రికార్డును తుడిచిపెట్టేశాడు. 2009లో శ్రియా రాకేష్ దేశ్ పాండే (మహారాష్ట్ర) 27 వాహనాల కింద ఈ ఫీట్ ను చేసి గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.

limbo-champion-devisri

దేవీశ్రీప్రసాద్ సాధారణంగా ఈ లింబో స్కేటింగ్ ని ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఒకనాడు ఇతడు ఈ స్కేటింగ్ చేస్తుండగా అతని తల్లిదండ్రులు లోకనాథం, పద్మ చూశారట! దీంతో వారు గతనెలలో 40 సుమోల కిందుగా ఈ ఫీట్ ను చేయించారు. అందులో దేవీశ్రీ సక్సెస్ కావడంతో బుధవారం వరల్డ్ అమేజింగ్ రికార్డ్స్, ఏషియన్ రికార్డ్స్, ఆంధ్రా రికార్డ్స్, భారత్ రికార్డ్స్, స్టార్ రికార్డ్స్ కు సంబంధించిన ప్రతినిధుల సమక్షంలో మరోసారి ఈ ఫీట్ ను చేయించారు. అతని ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన ప్రతినిధులు.. అతడ్ని మ్యాన్ ఆఫ్ ది రికార్డ్స్ పేరుతో సత్కరించారు. ఇతనిని త్వరలోనే గిన్నిస్ రికార్డ్స్ ప్రతినిధులకు పంపనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devisri Prasad boy  limbo skating champion  tirupati  

Other Articles