IOC President Thomas Bach Clarified that Narendra Modi Not interested to conduct Olympic Games

Prime minister narendra modi olympic games conduct ioc president thomas bach

Olympic Games, narendra modi, indian olympic games, thomas bach, modi thomas bach news, modi updates, thomas bach updates, 2024 Olympic, IOC President Thomas Bach

Prime Minister Narendra Modi Olympic Games Conduct IOC President Thomas Bach : International Olympic Committee President Thomas Bach said he was surprised by the speculations of India bidding to host the Olympics in 2024.

ఒలంపిక్స్ కు మొగ్గుచూపని ప్రధాని మోడీ

Posted: 04/28/2015 10:29 AM IST
Prime minister narendra modi olympic games conduct ioc president thomas bach

నాలుగేళ్లకోసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఒలంపిక్స్ క్రీడలను నిర్వహించాలంటే అంతా ఆషామాషీ విషయం కాదు. వీటిని నిర్వహించిన సదరు దేశం ఆర్థికపరంగా లాభాన్ని ఆర్జించే అవకాశం వుంది కానీ.. అంతకంటే ముందు దేశవిదేశాల నుంచి వచ్చే క్రీడాకారులు, ఆ దేశ రాజకీయ నాయకులు, ఇంకా సర్వత్ర కార్యక్రమాలను నిర్వహించాలంటే తడిసి మోపెడవుతుంది. ఇంతా భారీ ఖర్చుతో కూడిన ఈ క్రీడలను 2024లో భారత్ లో నిర్వహించనున్నట్లుగా గతకొన్నాళ్ల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే ఎన్నో నష్టాల్లో కూరుకుపోయిన భారత్.. ఇంతటీ ఖరీదైన క్రీడలను నిర్వహిస్తుందా? అసలు ఇది నిజమేనా? అంటూ అందరూ డైలమాలో పడిపోయారు. దీనిపై మోడీ నిర్ణయం ఏంటి? అని ఒకటే ప్రశ్నలు వెల్లువెత్తాయి. చివరికీ మోడీ ఆ ప్రశ్నల చిక్కుముడి తెరను దించేశారు. 2024 ఒలంపిక్స్ నిర్వహిణకు తాము ఆసక్తి చూపడం లేదని ప్రధాని మోడీ స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ వెల్లడించారు.

ఐఓసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత్ వచ్చిన బాచ్.. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధికారిక నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే ఒలంపిక్ నిర్వహణ విషయంపై చర్చించగా.. వాటి నిర్వహణ గురించి వస్తున్న వార్తలను ప్రధాని ఖండించినట్లుగా బాచ్ స్పష్టం చేశారు. ఈ వార్తలు విన్న అనంతరం ఐఓసీ కూడా షాకైనట్లుగా ఆయన తెలిపారు. గతేడాదే ఏర్పడిన భారత్ ఒలంపిక్ సమాఖ్య ఈ ప్రతిష్టాత్మక క్రీడలను సమర్థంగా నిర్వహించలేదని, దానికి ఇంకా సమయముందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం.. మోడీతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని ఆయన వర్ణించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Olympic Games  narendra modi  IOC President Thomas Bach  

Other Articles