Saina Nehwal thanks fans after officially becoming World No. 1

Shuttler saina nehwal officially became the world no 1

ace India shuttler Saina Nehwal, Saina Nehwal officially became the World No. 1, Badminton World Federation (BWF) released its latest rankings, Saina Nehwal thanks fans, Saina Nehwal, BWF rankings, World No. 1, India Open, Caroline Marin, Ratchanok Inaton, Badminton News

As the Badminton World Federation (BWF) released its latest rankings on Thursday where ace India shuttler Saina Nehwal officially became the World No. 1, she thanked all her fans for their support.

సైనా.. అధికారికంగా ప్రపంచ నెం. 1, ఫ్యాన్స్ కు థ్యాంక్స్

Posted: 04/02/2015 06:15 PM IST
Shuttler saina nehwal officially became the world no 1

భారత షెట్లర్ సైనా నెహ్వాల్ ఇవాళ అధికారికంగా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ గా నిలించింది. ఇవాళ ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధికారికంగా ర్యాంకింగ్ లను విడుదల చేసింది. ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని అక్రమించుకున్న కారోలైన్ మారిన్ సహా రాట్చనోక్ ఇనాటన్ లను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి సైనా ఎగబాకింది. ఇండియన్ ఓపెన్ సెమీస్ లో కారోలైన్ మెరిన్ ఓటమితోనే సైనా అగ్రస్థానానికి చేరుకున్నా.. అటు ఇండియన్ ఓపెన్ సెమీస్, ఫైన్సల్ రెంటింటితోనూ విజయం సాధించి తన ర్యాంకును మెరుగుపర్చుకుంది.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్ ను విడుదల చేయగానే.. సైనా నెహ్వాల్ తన ఫోటోను ట్విట్టర్ లో పెట్టి తన ఆటను నిత్యం వెన్నంటి ప్రోత్సహిస్తున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఇవాళ్టి నుంచి తాను ప్రపంచ ర్యాంకింగ్ లో నెంబర్ వన్ గా నిలిచానని ఇది తనకు ఎంతో ఎంతో ఎంతో సంతోషాన్ని ఇస్తుందని పేర్కోంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షెట్లర్ గా కూడా సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని అక్రమించేందుకు తనతో పోటీ పడిన కారోలిన్ మారిన్ ఓటమితో.. వరుసగా మూడు విజయాలను నమోదు చేసుకున్న సైనాను ఈ ర్యాంక్ వరించింది.
 
జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saina Nehwal  BWF rankings  World No. 1  Badminton News  

Other Articles