Muller has played a wonder innings opposite to the america team in fifa world cup 2014

Muller has played a wonder innings opposite to the america team in fifa world cup 2014, fifa world cup 2014, 2014 fifa world cup, fifa world cup 2014 news, germany player muller, germany player muller has played a wonder innings, fifa world cup 2014 latest news

Muller has played a wonder innings opposite to the america team in fifa world cup 2014

అమెరికాకు చుక్కలు చూపించిన ముల్లర్

Posted: 06/27/2014 12:12 PM IST
Muller has played a wonder innings opposite to the america team in fifa world cup 2014

(Image source from: Muller has played a wonder innings opposite to the america team in fifa world cup 2014)

ఫిపా వరల్డ్ కప్ 2014లో ఈసారి ఫలితాలు విచిత్రంగా వెల్లడయ్యాయి. గ్రూప్-జి నుంచి పోటీపడ్డ జట్లలో నాకౌట్ కు చేరుకునే టీమ్ లు ఏవో తేలిపోయింది. ఇందులో జర్మనీ, అమెరికా టీంలు నాకౌట్ కు చేరిపోగా... పోర్చుగల్, ఘనా జట్లు ఇంటిదారి పట్టాయి. ఈ జట్ల మధ్య హోరాహోరీగా పోటీలు జరిగాయి. ఇందులో పోర్చుగల్, ఘనా జట్టుమీద ఘనవిజయం సాధించినప్పటికీ నాకౌట్ కు చేరుకోలేకపోయింది.

జర్మనీ, అమెరికా టీంల మధ్య జరిగిన పోరాటం ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఆట మొదలైనప్పటి నుంచి రెండు టీంలు గోల్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే జర్మనీ జట్టు ఆటగాడు అయిన ముల్లర్ ఈసారి అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. గత మ్యాచుల్లో అతను చూపించిన ప్రతిభను ఇందులో కూడా చూపించాడు. ఎవరూ ఊహించని విధంగా గోల్ ను సంపాదించి, అమెరికా జట్టుకు చుక్కలు చూపించాడు.

ప్రపంచం కప్ ఆరంభంలో కూడా పోర్చుగల్ జట్టుతో తలపడినప్పుడు కూడా ముల్లర్ హ్యాట్రిక్ గోల్స్ సాధించి, జర్మనీకి అద్భుతమైన విజయాన్ని సంపాదించి పెట్టాడు. అలాగే కీలకమైన గ్రూప్ దశ చివరి మ్యాచ్ లో కూడా గోల్ సాధించి, నాకౌట్ కూ చేరేలా చేశాడు. ప్రతమార్థ భాగంలో ఎంతో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో ముల్లర్ 55వ నిముషంలో అద్భుతమైన గోల్ వేసి, అందరినీ ఆశ్చర్యచికితుల్నీ చేశాడు. అమెరికా జట్టు ఆటగాళ్లు తన చుట్టూ వున్నప్పటికీ.. బంతిని వారి చేతికి అందనివ్వకుండా దూసుకుపోయాడు.

ఆ సమయంలో మొదట జర్మనీ ఆటగాడు హోవెడస్ గోల్ వేయడానికి ప్రయత్నించగా... అమెరికా గోల్ కీపర్ తనదైన శైలిలో అద్భుత ప్రదర్శన చేసి అడ్డుకున్నాడు. అయితే గోల్ కీపర్ నుంచి వెనక్కి వచ్చిన ఆ బంతిని కాస్త దూరంలో వున్న ముల్లర్ అందుకున్నాడు. అప్పుడు జర్మనీ డిఫెండర్లంతా అమెరికా గోల్ కీపర్ ను బోల్తా కొట్టిస్తూ, కన్ ఫ్యూజన్ లో పడేయగా... దానిని అదునుగా తీసుకుని ముల్లర్ గోల్ చేశాడు. దీంతో జర్మనీ స్కోర్ 1-0 ఆధిపత్యంతో మొదటి స్థానంలో నిలిచింది.

ఆ తరువాత కూడా గోల్స్ ను సాధించడానికి జర్మనీ ఆటగాళ్లు విశ్వప్రయత్నాలు చేశారు. 63 శాతం వరకు బంతిని తమ నియంత్రణలోనే వుంచుకున్నారు. కానీ అమెరికా డిఫెండర్స్ మాత్రం వారి ప్రయత్నాలను విఫలం చేసుకుంటూ మంచి ప్రదర్శనను కనువిందు చేశారు. ముఖ్యంగా అమెరికా గోల్ కీపర్ ఐదుసార్లు బంతిని అడ్డుకుని, జర్మనీ ఆటగాళ్లకు ధీటుగా జవాబిచ్చాడు. అయితే ఒక్కసారి మాత్రం బంతిని అడ్డుకోవడంలో విఫలం అయ్యాడు. జర్మనీ ఆటగాళ్లు మొత్తం 9సార్లు గోల్స్ వేయడానికి ప్రయత్నించగా... అమెరికా జట్టు ఆటగాళ్లు మాత్రం కేవలం ఒక్కసారే ప్రయత్నం చేయగలిగారు.

జర్మనీ ఆటగాడు ముల్లర్ ఈ పోటీలో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో... గతంలో 16వ స్థానంలో వున్న జర్మనీ టీం ఇప్పుడు టాప్ ప్రపంచ స్కోరింగ్ చార్ట్స్ లో చేరిపోయింది. అలాగే ముల్లర్ కూడా లియోనల్ మెస్సీ, నేమార్ వంటి స్టార్ ఆటగాళ్ల లిస్టులో తన పేరును కూడా నమోదు చేసుకున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles