ఫిఫా వరల్డ్ 2014లో ఈసారి మ్యచ్ లు ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. పిల్ల జట్ల నుంచి జట్ల వరకు వున్న స్టార్ ప్లేయర్లు... వచ్చిన అవకాశాన్ని సద్వినయోగం చేసుకుంటూ తమ ప్రతిభను ప్రదర్శించారు. వరుస గోల్స్ వేసుకుంటుపోతూ మైదానంలో వున్న అభిమానులకు కనువిందు చేయించారు. మునుపటిలాగే స్టార్ ప్లేయర్లుగా నిలిచి, తమ జట్టును విజయబాటవైపు తీసుకెళ్లారు.
అందులో భాగంగానే అర్జెంటీనా, నైజీరియా మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఎవరూ ఊహించని విధంగా రకరకాల మలుపులతో మ్యాచ్ ప్రారంభమైంది. ఆట మొదలు కావడమే ఆలస్యం.. అర్జెంటీనా ఆటగాడు అయిన మెస్సీ మెరుపు ప్రదర్శనను కనబరిచాడు. మూడో నిముషంలోనే ఒక గోల్ ను సాధించి, తన అర్జెంటీనా టీంను ఆధిక్యంలో నిలబెట్టాడు. ఈ గోల్ ను కూడా మెస్సీ ఎంతో అనూహ్యంగా సాధించాడు. తొలుత డిమారియా షాట్ కొట్టిన అనంతరం బంతి పోస్ట్ కు తగిలి వెనక్కు రాగా... మెస్సీ దానిని అందుకుని అద్భుతంగా నెట్ లో వేసి గోల్ సాధించాడు. దీంతో అర్జెంటీనా టీమ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
అయితే ఈ సంతోషం అర్జెంటీనా జట్టు ఆటగాళ్లకు అంత ఎక్కువ సేపు వరకు నిలవలేదు. నైజీరియా టీం ఆటగాళ్లు కూడా వీరికి ధీటుగానే సమాధానం చెప్పారు. నైజీరియా స్టార్ ఆటగాడు అయిన మూసా... ఆ మరునిముషంలోనే ఒక గోల్ ను సాధించి, 1-1తో స్కోరును సమం చేశాడు. దీంతో వీరిద్దరి మధ్య పోరాటం ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఎప్పుడు, ఏమిటి, ఎలా జరుగుతుందోనన్న ఆందోళలనలో అభిమానులు మునిగిపోయారు.
ప్రతమార్థం ముగుస్తుందన్న కొంత సమయానికి ముందు (అదనపు సమయంలో) మెస్సీ కళ్లు చెదిరేలా మరో గోల్ ను సాధించాడు. దీంతో అర్జెంటీనా టీమ్ 2-1 ఆధిక్యంతో నిలిచింది. 30 గజాల దూరం నుంచి ఫ్రీకిక్ ను ఇతడు గోల్ గా మార్చి, నెట్ లోకి తోసేశాడు. దీంతో ప్రతమార్థం ముగిసింది. ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిని, కేకలు వేయడం మొదలుపెట్టేశారు. మైదానంలో అభిమానులు అరుస్తున్న అరుపులు ఆకాశాన్ని తాకేలా హోరెత్తాయి.
ఇంకా రెండో అర్థభాగంలో ఆట మొదలయిన రెండు నిముషాలకే నైజీరియా ఆటగాడు మూసా తన ప్రతిభతో రెండో గోల్ ను సాధించాడు. దీంతో స్కోరు మళ్లీ సమం కావడంతో అభిమానులందరిలో ఉత్సాహం పెరిగిపోయింది. ఎవరు గెలుస్తారోనన్న ఆశతో అందరు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతలోనే మంచి ప్రతిభను ప్రదర్శించిన మెస్సీ... ఆటకు అర్ధగంట సమయానికి ముందే విరామం తీసుకున్నాడు. అర్జెంటీనా కోచ్ మెస్సీని వెనక్కు పిలిచి, సబ్ స్టిట్యూట్ ను దించడంతో అభిమానులు నిరాశ చెందారు.
అయినా అర్జెంటీనా ఆటగాళ్లు తమ ఓటమిని ఒప్పుకోలేదు. ఎలాగైనా మ్యాచ్ ను గెలవాలనే పంథంతో ముందుకు సాగారు. 63వ నిముషంలో అర్జెంటీనా ఆటగాడు అయిన రోజో గోల్ ను సాధించి జట్టును ఆధిక్యంలో నిలిపాడు. దీంతో అర్జెంటీనా జట్టు 3-2 స్కోరుతో విజయం సాధించింది. ఏదేమైనా... మెస్సీ ప్రదర్శించిన ప్రతిభ కేవలం అభిమానులను ఉర్రూతలూగించడమే కాకుండా... జట్టును ప్రథమ స్థానంలో నిలపడంలో కీలకమైపోయింది. దీంతో ఈసారి మెస్సీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయాడు. మెస్సీ తొలి రెండు మ్యాచుల్లో ఒక్కో గోల్ సాధించిన సంగతి అందిరికి తెలిసిందే!
AS
(And get your daily news straight to your inbox)
Aug 16 | ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్)ని ఫిఫా సస్పెండ్ చేసింది. ‘‘థర్డ్ పార్టీల నుంచి ‘అనవసరమైన ప్రభావం’ ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా (ఎఫ్ఐఎఫ్ఏ) కౌన్సిల్... Read more
Jul 29 | కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లకు శుభారంభం దక్కింది. భారత్ ఆడిన తొలి బాక్సింగ్ బౌట్లో భారత్ విజయాన్ని దక్కించుకుంది. లైట్ వెల్టర్ వెయిట్ (60 కేజీ- 63.5 కేజీలు) విభాగంలో జరిగిన బౌట్లో భారత... Read more
May 28 | ప్రముఖ జిమ్నాస్ట్ అరుణ బుద్ధారెడ్డి తన కోచ్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన అనుమతి లేకుండా శారీరక సామర్థ్య (ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షను వీడియో తీశారంటూ ఆయనపై అభియోగాలు మోపారు. జిమ్నాస్టిక్స్... Read more
May 27 | ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ బంగారు పతాక విజేత నిఖత్ జరీన్.. హైదరాబాద్‌కు చేరుకుంది. తొలిసారి తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఆమెకు తెలంగాణ సర్కార్ ఘనస్వాగతం పలికింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో... Read more
Dec 17 | బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత షెట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో శ్రీకాంత్ పతకం ఖాయం చేసుకున్నాడు.... Read more