Animals predict fifa world cup results

animals predicting fifa world cup winners, fifa world cup 2014, psychic animal predictions, south africa,Octopus,World Cup

emember how Paul the Octopus was all over the news for predicting who would win the FIFA World Cup last time

మళ్ళీ తెరపైకి ఆక్టోపస్ జోస్యాలు

Posted: 06/14/2014 01:03 PM IST
Animals predict fifa world cup results

ప్రపంచదేశాలన్నింటికి మూఢ నమ్మకాల విశ్వాసం ఉంటుందని అర్థమౌతుంది కొన్ని సంఘటనల ఆధారంగా. అవి అభివృద్ధి చెందిన దేశాలైనా కావచ్చు, చెందుతున్న దేశాలనైనా కావచ్చు. కానీ చాలా దేశాల వారు చెప్పే మాటేంటంటే... భారతదేశంలోనే ఈ మూఢనమ్మాలు ఉంటాయని చెప్పి ఆ అపవాదాన్ని మన పై తోసేస్తారు. కానీ సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా ప్రపంచదేశాల మూఢ నమ్మకాలు ఏంటో బయట పడుతున్నాయి. సాకర్ ఫుట్ బాల్ ప్రపంచకప్ అంటే 2010లో దక్షిణాప్రికా టోర్నీ గుర్తుకు రావడం లేదు.

ఆ టోర్నీ గురించే ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఆటోర్నీలో వివిధ దేశాల జట్ల ఫలితాలను ముందే ఊహించిన ‘అక్టోపస్ పాల్ ’ అదేనండి నీటి జీవి బాగా హైలెట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి దానికి మరోమారు తెరలేపారు. 2014 బ్రెజిల్ సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా ‘అక్టోపస్ రెజీనా  ’ అనే జీవితో మ్యాచ్ ఫలితాలను నిర్ణయిస్తున్నారు. ర్లిన్ అక్వేరియం ‘అక్వా డామ్’లో ఉంటున్న రెజీనాను తెర పైకి తెచ్చారు. ఈనెల 16న పోర్చుగల్‌తో జరగనున్న మ్యాచ్‌లో జర్మనీ గెలుస్తుందని తేల్చేసింది.

ఆహార పదార్థాలతో కూడిన ఓ పాత్రకు రెండు రంధ్రాలు చేసి వాటిని ఇరు దేశాల పతకాలతో కప్పి ఉంచి అక్వేరియంలో ప్రవేశపెట్టారు. అయితే జర్మనీ పతాకం ఉన్న రంధ్రం గుండా రెజీనా తన టెంటకిల్‌ను లోపలికి దూర్చింది. దీంతో ఫలితం జర్మనీదే అంటున్నారు. అయినా పిచ్చినమ్మకాలు కాకపోతే ఏంటి ఇవి. ఇటీవల  ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ గెలుస్తుందని ఆ దేశంలోని సముద్రపు తాబేలు ‘బిగ్ హెడ్ ’ చెప్పిన జోస్యం నిజం కావడంతో,  అక్టోపస్ రెజీనా జోస్యానికి బాగా క్రేజ్ ఏర్పడింది. ఇది చెప్పింది ఏ మాత్రం నిజం అవుతుందో తెలియదు గానీ వీళ్ళ మూఢ నమ్మకాలు మాత్రం ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles