Roger federer urged to retire after us open humiliation

Roger Federer urged to retire, Tennis, Roger Federer, Tommy Robredo, US Open, Flushing Meadows, Tennis,People

World's greatest player is beaten in straight sets by Tommy Robredo. Is this the end of an era.

ఫెడెక్స్ శకం ముగిసిందా ?

Posted: 10/17/2013 07:11 PM IST
Roger federer urged to retire after us open humiliation

ఈ ఏడాది కేలండర్ లో చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్ లో ఫ్రీ క్వార్టర్స్ లో నిష్ర్కమించి అందిరికి షాక్ ఇచ్చిన ఫెడక్స్ కెరియర్ చివరి దశకు చేరుకుందా ? ఇప్పటి వరకు ఏ ఆటగాడు సాధించలేనన్ని గ్రాండ్ స్లామ్ లు సాధించి నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగిన ఈ స్విస్ దిగ్గజం టెన్నిస్ నుండి తప్పుకోక తప్పదా అంటే గత కొన్ని గణాంకాలను చూస్తే ఇక తప్పదనే అనిపిస్తుంది. 2004 నుంచి 2008 వరకు వరసగా ఐదుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గి 2009లో రన్నరప్‌గా నిలిచిన ఫెడరర్ ఈసారి నాలుగో రౌండ్‌లోనే ఓడిపోయాడు. గతంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో ఫెడరర్ ఓడిపోయిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. కానీ ఈసారి అతను ఓడిన విధానం చూశాక ఫెడరర్ కెరీర్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందనే అనుమానం కలుగుతోంది. ఈ ఏడాది ఫెడరర్ ఒకే ఒక్క ఏటీపీ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. అతని కెరీర్‌లో ఇలా జరగడం 2001 తర్వాత ఇదే తొలిసారి. ప్రతి సారి రాకెట్ వేగంలా దూసుకుపోయే అతడిలో వేగం తగ్గింది. మొన్నటి మ్యాచ్ లో ఓడిన అనంతరం ఈ స్విస్ ఆటగాడిని ఉద్దేశించి, ప్రముఖ ఆటగాడు అయిన మెకన్రో నోటి నుండి... ఎంత మంది అగ్రశ్రేణి ఆటగాళ్ళను మట్టికరిపించిన ఫెదరర్ నేనా నేను చూసేది అని వ్యాఖ్యానించాడు. ఇతని ఆట తీరు పై అతని ఒక్కడి అప్రాయమే కాదు ప్రపంచంలో ఉన్న టెన్నిస్ అభిమానులది కూడా. 302 వారాలపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్నాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడితే వరుసగా 57 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన తొలి ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టిస్తాడు. అంతటి ఆటగాడు ఇలాంటి ఆటను ప్రదర్శిస్తే సగటు అభిమానికి అలాంటి అనుమానాలు రావడం సహజమేనేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles