Debutant Maheesh Theekshana Stars with Four Wickets అరంగేట్రం చేసిన మ్యాచులోనే నాలుగు వికెట్లు..

Sl vs sa 3rd odi debutant maheesh theekshana stars as sri lanka thrash south africa

Debutant spinner, Maheesh Theekshana, off-spinner, sri lanka, south africa, morawakage maheesh theekshana, cricket, sri lanka vs south africa, sl vs sa, cricket news, latest cricket news, sports news, sports

Debutant spinner Maheesh Theekshana claimed four wickets as Sri Lanka hammered South Africa by 78 runs in the third odi to clinch the series 2-1. Theekshana, an off-spinner with a lethal carrom ball, returned figures of 4-37 as the hosts bowled out South Africa for 125 in 30 overs while chasing a target of 204 in Colombo.

అరంగేట్రం చేసిన మ్యాచులోనే నాలుగు వికెట్లు..

Posted: 09/08/2021 05:06 PM IST
Sl vs sa 3rd odi debutant maheesh theekshana stars as sri lanka thrash south africa

ఎంతటి దూకుడు మీదున్న క్రీడాకారుడైన అంతర్జాతీయంగా అరంగ్రేటం చేస్తున్న మ్యాచులో కాసింత భయం, అనుకువను ప్రదర్శించాలని అనుకుంటాడు. అంతర్జాతీయ వేధికపై తాను నిలవాలంటే నిదానంగా రాణించాలని భావించి.. తమ జట్టు గెలుపులో కీలక పాత్రను పోషిస్తూనే.. ఒదిగివుండాలని కూడా భావిస్తారు. కానీ ఈ శ్రీలంక బౌలర్ మాత్రం తన దూకుడుకు కళ్లం అన్నది లేదని నిరూపించాడు. అది ఏ వేదికైనా.. ఏ ప్రాంతమైనా సరే.. తన దూకుడుతో.. ప్రత్యర్థి బౌలర్లను కట్టడి చేయడంతో పాటు తన జట్టు గెలుపులోనూ తనదైన ముద్రను వేశాడు.

టీ20 మ్యాచుల కోసం ఎంపిక చేసిన బౌలర్ ను వన్డేలో అరంగ్రేటం చేయిస్తే ఎలా వుంటుంది.. అది రిస్క్. కానీ ఆ రిస్క్ ను తీసుకున్న జట్టు కెప్టెన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక బౌలర్ మహీశ్ తీక్షణను తెరంగ్రేటం చేయించాడు కెప్టెన్. దీంతో ఈ మ్యాచులో ఏకంగా తీక్షణ నాలుగు వికెట్ల సాధించిడంతో.. 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ ను 2-1తో లంకేయులు కైవసం చేసుకున్నారు. ఈ విజయంలో ఆ జట్టు స్పిన్నర్‌ క్షణ కీలక పాత్ర పోషించాడు. తన వన్డే అరంగేట్ర మ్యాచ్‌లో అధ్బుతమైన ప్రదర్శన చేశాడు. అయితే మ్యాచ్‌ అనంతరం శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక.. మహీష్ తీక్షణపై ప్రశంసల వర్షం కురిపించాడు.

"దక్షిణాఫ్రికాతో టీ 20 ల్లో ఆడేందుకు తొలుత తీక్షణను జట్టులోకి తీసుకున్నాము.. ఆనుహ్యంగా మరో స్పిన్నర్‌ ను జట్టులోకి తీసుకున్నాను. కానీ నేను కెప్టెన్‌గా ఆ రిస్క్ తీసుకున్నాను. సెలెక్టర్లు ,కోచ్‌లు నాకు మద్దతు ఇచ్చారు. అది మాకు పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది, ”అని మూడో వన్డే తర్వాత శనక వెల్లడించాడు. తీక్షణ ఇంతకు ముందు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడాడని, కుడి చేతి వాటం స్పిన్నర్ స్లీవ్‌లో చాలా వైవిధ్యాలు ఉన్నందున బ్యాట్స్‌మన్‌లు అతడి బౌలింగ్‌ ను ఆర్ధం చేసుకోవడం  అంత సులభం కాదని దాసున్ శనక అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Debutant spinner  Maheesh Theekshana  off-spinner  Sri Lanka vs South Africa  Cricket  sports  

Other Articles