Shafali Verma retains no 1 spot in ICC T20 rankings ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో సత్తాచాటిన టీమిండియా

Icc women s rankings shafali verma retains no 1 spot in t20 smriti mandhana 3rd

ICC T20 Rankings, ICC T20 Rankings full list, ICC T20 Rankings news, Shafali Verma, Smriti Mandhana, Deepthi Sharma, poonam yadav, Sophie Devine, ICC T20I rankings full, cricket, cricket news, sports news, sports

India's star opener Shafali Verma retained the top spot among women’s T20 batters while New Zealand’s Sophie Devine is the new joint top-ranked all-rounder in the latest ICC Rankings issued. Devine is sharing the No.1 spot with Natalie Sciver of England at 371 points. Scotland's Kathryn Bryce is third with 327 points.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో సత్తాచాటిన టీమిండియా

Posted: 09/08/2021 03:58 PM IST
Icc women s rankings shafali verma retains no 1 spot in t20 smriti mandhana 3rd

భారత మహిళా క్రికెట్‌ టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో తన అగ్రస్థానాని మరోమారు నిలబెట్టుకుంది. ఇప్పటికే టాప్‌ ర్యాంక్ లో కోనసాగుతున్న ఆమె తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి విడుదల చేసిన టి20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో ఆమె 759 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అమెతో పాటు మూడవ స్థానంలో భారత స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (716) కొనసాగుతోంది. కాగా రెండో స్థానంలో ఆ్రస్టేలియా బ్యాటర్‌ బెత్‌ మూనీ (744 రేటింగ్స్‌) ఉన్నారు.

ఇక బౌలింగ్ విభాగంలో టాప్ 10లోనూ ఇద్దరు భారత ఉమెన్ బౌలర్లు తమ సత్తా చాటుకున్నారు. బౌలింగ్ లో ఇంగ్లాండ్ కు చెందిన సోఫీ ఎస్లీస్టోన్ అగ్రస్థానంలో నిలువగా, టీమిండియాకు చెందిన దీప్తి శర్మ 702 పాయింట్లతో ఆరో స్థానంలో నిలువగా, 670 పాయింట్లతో పూనమ్‌ యాదవ్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక అల్ రౌండర్ క్యాటగిరిలోనూ టాప్ టెన్ లో భారత్ క్రిడాకారిణికి స్థానం దక్కింది. ఈ స్థానంలోనూ ఇంగ్లాండ్ కు చెందిన నటాలీ సైవర్ 371 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా, టీమిండియాకు చెందిన దీప్తి శర్మ 321 పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC T20 Rankings  Shafali Verma  Smriti Mandhana  Deepthi Sharma  poonam yadav  cricket  sports  

Other Articles