Brendan Taylor to retire from international cricket క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మరో టాప్ క్రికెటర్

Zimbabwe s brendan taylor announces retirement from international cricket

zimbabwe, ireland, brendan ross murray taylor, retirement, International cricket, ireland vs zimbabwe, Cricket news, Sports news, latest cricket updates, India, Cricket, sports

Former Zimbabwe skipper and wicket-keeper batsman Brendan Taylor has decided to retire from international cricket and will play his last match on Monday against Ireland. Taylor made his debut in 2004 in an ODI against Sri Lanka and went on to become one of Zimbabwe's finest ever cricketers in international cricket.

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మరో టాప్ క్రికెటర్

Posted: 09/13/2021 03:14 PM IST
Zimbabwe s brendan taylor announces retirement from international cricket

జింబాబ్వే మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌, బ్యాట్స్ మెన్‌ బ్రెండన్‌ టేలర్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. సోషల్‌ మీడియా వేదికగా తాను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆయన వెల్లడించాడు. ఐర్లాండ్ తో ఇవాళ జరిగే మూడో వన్డే తన చివరి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ అని పేర్కొన్నాడు. ఇష్టంగా వదులుతున్నాడా.? లేక బలవంతంగా దూరం అవుతున్నాడా అన్నది? ప్రశ్నగా మిలిగిలింది. ఆయన షేర్ చేసిన నోట్ లో భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేయడమే అనుమానాలకు రేకెత్తేందుకు కారణం అవుతున్నాయి.

17 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానని, అరంగేట్రం చేసిన నాటి నుంచి జట్టును మెరుగైన స్థితిలో ఉంచేందుకు తన వంతు కృషి చేశానని పేర్కొన్నాడు. బరువెక్కిన హృదయంతో ఈ ప్రకటన చేస్తున్నానంటూ ట్విటర్‌ వేదికగా టేలర్‌ ఓ భావోద్వేగ నోట్‌ షేర్‌ చేశాడు. తన ఎదుగుదలకు తోడ్పడిన జింబాబ్వే క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌, కోచ్‌లు, అభిమానులు, సహచర ఆటగాళ్లు, తన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. 2004లో ఆయన అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు.

ఇప్పటి వరకు మొత్తంగా 34 టెస్టులాడిన అతడు... 2320 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌ విషయానికొస్తే... 45 టీ20 మ్యాచ్‌లు ఆడిన టేలర్‌.. 118.22 స్ట్రైక్‌రేటుతో 934 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ద శతకాలు ఉన్నాయి. ఇక తనెంతగానో ఇష్టపడే వన్డే క్రికెట్‌లో 204 మ్యాచ్‌లు ఆడి.. 6677 పరుగులతో సత్తా చాటిన టేలర్‌.. జింబాబ్వే తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు(11) చేసిన ఆటగాడిగా తన పేరు లిఖించుకున్నాడు. ప్రస్తుతం ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా మూడో వన్డే ఆడిన అనంతరం ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ నుంచి అతడు నిష్క్రమించనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles