TeamIndia in top place in ICC Test Ranking ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో.. అందనంత దూరంలో భారత్.!

Shardul thakur rise in mrf tyres icc men s test player rankings

Team India, ICC Test Rankings, MRF tyres ICC rankings, Virat Kohli, Rohit Sharma, Jasprit Bumrah, Ravichandran Ashwin, Shardul Thakur, England vs India, Oval test, Ind vs Eng, Cricket news, Sports news, latest cricket updates, India, Cricket, sports

England batter Ollie Pope and India all-rounder Shardul Thakur have made notable gains in the MRF Tyres ICC Men’s Test Player Rankings after fine performances in the fourth Test of their ICC World Test Championship series played at The Oval.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో.. అందనంత దూరంలో భారత్.!

Posted: 09/08/2021 03:09 PM IST
Shardul thakur rise in mrf tyres icc men s test player rankings

ఇంగ్లాండ్ తో ఓవల్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచులో టీమిండియా చారిత్రక విజయాన్ని అందుకుంది. సుమారుగా 50 ఏళ్లుగా ఈ మైదానంలో విజయం కోసం అర్రులు చాచిన టీమిండియాకు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఘనవిజయాన్ని సోంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ఈ విజయంపై భారత ప్రముఖులతో పాటు ప్రపంచ ప్రముఖులు కూడా విరాట్ సేనకు అభినందనలు తెలిపారు. ఈ విజయంతో ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ 2021-23 జాబితాలోనూ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ నుంచి చూసుకుంటే భారత్‌ రెండు విజయాలు.. ఒక ఓటమి.. ఒక డ్రాతో మొత్తంగా 54.17 శాతం పర్సంటైల్‌తో 26 పాయింట్లు సాధించింది. ఇక రెండో స్థానంలో పాకిస్తాన్‌ ఉంది. పాక్‌ జట్టు విండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. ఓవరాల్‌గా ఒక గెలుపు, ఒక ఓటమితో 50 శాతం పర్సంటైల్‌తో 12 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా.. వెస్టిండీస్‌ 50 శాతం పర్సంటైల్‌తో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.

ఇక పాయింట్ల పరంగా ఇంగ్లండ్‌ విండీస్‌, పాక్‌ల కంటే ఎక్కవగా ఉన్నప్పటికీ.. టీమిండియాతో సిరీస్‌లో రెండు ఓటములు ఉండడంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఒక గెలుపు, రెండు ఓటములు, ఒక డ్రాతో 29.17 శాతం పర్సంటైల్‌తో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక నాలుగో టెస్టులో 157 పరుగులతో అద్భుత విజయంతో 50 ఏళ్ల తర్వాత ఓవల్‌ మైదానంలో విజయాన్ని అందుకుంది. 1971లో అజిత్‌ వాడేకర్‌ నాయకత్వంలో విజయాన్ని అందుకున్న టీమిండియా.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కోహ్లి నాయకత్వంలో ఓవల్‌ మైదానంలో విజయాన్ని సాధించింది. ఇక చివరిదైన ఐదో టెస్టు సెప్టెంబర్‌ 10 నుంచి మాంచెస్టర్‌ వేదికగా జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles