Stuart Broad in 500-wicket club ఐదు వందల వికెట్ క్లబ్ లోకి సువర్ట్ బ్రాడ్..

Stuart broad joins james anderson in 500 wicket club

Stuart Broad 500 Test wickets, stuart broad 500, kraigg brathwaite stuart broad 500, james anderson kraigg brathwaite 500, stuart broad most wickets tests, england vs west indies, jacques kallis courtney walsh 500 test wicket, kallis zaheer khan 300th test wicket, cricket news, sports news, Cricket, sports

Stuart Broad became only the 7th bowler in world cricket to pick 500 Test wickets when trapped West Indies batsman Kraigg Brathwaite during the final day of the ongoing 3rd Test in Manchester. Stuart Broad is only the 4th fast bowler in the history of the sport after James Anderson (589), Glenn McGrath (563) and Courtney Walsh (519) to reach the 500-wicket club.

జేమ్స్ అండర్సన్ సరసన చేరిన సువర్ట్ బ్రాడ్.. 500 వికెట్ క్లబ్ లోకి..

Posted: 07/28/2020 11:33 PM IST
Stuart broad joins james anderson in 500 wicket club

ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 500 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. ఈ ఘనత సాధించిన ఏడవ బౌలర్ గా నిలిచిన బ్రాడ్.. నాలుగో ఫాస్ట్ బౌలర్ తనను తాను నమోదు చేసుకున్నాడు. ఇక ఇంగ్లాండ్ తరపున ఈ ఘనత సాధించిన మరో పేస్ బౌలర్ గా నిలిచాడు. ఇంతకుముందే ఈ ఘనతను ఇంగ్లాండ్ కు చెందిన జేమ్స్ అండర్సన్ సాధించిన విషయం తెలిసిందే. ఒక టెస్ట్ మ్యాచ్లో 500 వికెట్లు తీసుకున్న ఇద్దరు బౌలర్లు ఒకే వైపు కలిసి ఆడటం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే వీరిద్దరికీ యాదృచ్ఛికంగా వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ వికెటే మైలురాయిని సాధించేందుకు దోహదపడింది.

వీరిద్దరితో పాటు మరో బౌలర్ కూడా ఈ అరుదైన ఫీటును సాదించేందుకు బ్రాత్వైట్ వికెట్ మాత్రమే టార్గెట్ అయ్యింది. కాగా యావత్ ప్రపంచంలో ఆరుగురు బౌలర్లు మాత్రమే ఈ అరుదైన ఫీటును సాధించిన వారిగా రికార్డులకెక్కారు. తాజాగా స్టువర్ట్ బ్రాడ్ కూడా ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏడవ బౌలర్ గా వారి సరసన చేరాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడోటెస్టు రెండో ఇన్నింగ్సులో బ్రాడ్ ఈ రికార్డు సాధించాడు. విండీస్ బ్యాట్స్‌మెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ వికెట్‌తో బ్రాడ్ 500 టెస్టు వికెట్లు పూర్తయ్యాయి. టెస్టుల్లో ఈ ఘనత సాధించిన రెండో ఇంగ్లండ్ ఆటగాడు బ్రాడ్.

ప్రపంచంలో నాలుగో పేసర్ గా ఈ ఘనత సాధించిన బ్రాడ్.. తన కన్నా ముందు తన సోంత జట్టు ఇంగ్లాండ్ కే చెందిన జేమ్స్ అండర్సన్ 589 తరువాత గ్లెన్ మెక్ గ్రాత్ 563, కోర్ట్నీ వాల్ష్ 519 సరసన చేరాడు. ఈ జాబితాలో చేరిన మరో ముగ్గురు దిగ్గజ బౌలర్లు స్పిన్నర్లు కావడం గమనార్హం. వారిలో అస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్, శ్రీలంకకు చెందిన మురళీధరన్, భారత్ కు చెందిన అనిల్ కుంబ్లే వున్నారు.ఇక బ్రాత్వైట్ కూడా దక్షిణాఫ్రికా అటగాడు జాక్వాస్ కాలిస్ తరువాత పలు క్రికెటర్లకు మైలు రాయిని అందుకోవడంలో కీలకంగా మారాడు. అండర్సన్, బ్రాడ్ లకు 500 వికెట్ అందించే మైలురాయిగా మారిన ఆయన ెడాన్ పార్కులో న్యూజీలాండ్ కు చెందిన పేసర్ ట్రెంట్ బౌల్ట్ 200 వ టెస్ట్ వికెట్ గానూ 2017లో మారాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stuart Broad  500 Test wickets  England  kraigg brathwaite  Eng vs WI  test wicket  Cricket  sports  

Other Articles