Cricket celebrities mourn Rishi kapoor death రుషికపూర్ మరణంతో క్రీడాలోకం దిగ్భ్రాంతి

Romantic hero of our times india mourns rishi kapoor

Actor Rishi Kapoor death, actor Rishi Kapoor passed away, Virat Kohli, Sachin Tendulkar, RaviShastri, Anil Kumble, Harbhajan singh, Shikar Dhawan, Virendra sehwag, vvs Laxman, Shikar dhawan, Bollywood, Tollywood, movies, Entertainment

Veteran Bollywood actor Rishi Kapoor breathed his last on April 30. He was 67. This news comes a day after Bollywood lost Irrfan Khan on Wednesday due to colon infection.

బాలీవుడ్ నటుడు రుషీకపూర్ మృతితో క్రీడాప్రముఖుల దిగ్భ్రాంతి..

Posted: 04/30/2020 09:36 PM IST
Romantic hero of our times india mourns rishi kapoor

బాలీవుడ్‌ ప్రఖ్యాత నటుడు రిషీకపూర్ కన్నుమూయడంతో పలువురు టీమ్‌ఇండియా క్రికెటర్లు సంతాపం తెలిపారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన‌ ఈరోజు ఉదయం ముంబయిలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల బాలీవుడ్‌తో పాటు ఇతర రంగాల ప్రముఖులు శోకతప్త హృదయాలతో సంతాపం తెలుపుతున్నారు. టీమీండియా మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, అనిల్‌కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తదితరులు ట్విటర్‌లో స్పందించారు.

* ఇది నమ్మశక్యం కాని నిజం. నిన్న ఇర్ఫాన్‌ఖాన్‌, ఈరోజు రిషీకపూర్‌. ఈరోజు ఒక దిగ్గజం కన్నుమూయడం జీర్ణించుకోలేని విషయం. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మ శాంతించాలి.  -విరాట్‌కోహ్లీ


* ‘రిషీకపూర్‌ మృతి చెందారనే వార్త విని ఎంతో బాధగా అనిపించింది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన్ని కలుస్తున్నాను. కలిసిన ప్రతిసారీ ఆయన అదే ఉత్సాహంతో ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను’’ - సచిన్‌


* రిషీకపూర్‌ మరణవార్త కలచివేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి  -సెహ్వాగ్‌

* ఈ దుర్వార్తతో నిద్రలేచా. రిషీకపూర్‌ ఇక లేరు. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ రిషీ జీ. ఆయన మృతికి నివాళులు.  -హర్భజన్‌ సింగ్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles