కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఈ వైరస్ ధాటికి పాకిస్తాన్ అల్లాడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని కరోనా బాధితులను అదుకునేందుకు దేశాలు ముందుకు రావాలని పలువురు క్రికెటర్లు ప్రాధేయపడుతున్నారు. అయితే ఇవేమీ తమకు పట్టనట్టు కొందరు క్రికెటర్లు వ్యవహరిస్తున్నారు. క్రికెట్ లో తమ మెరుగైన అటతీరును ప్రదర్శించి.. ఖ్యాతితో పాటు దేశ గౌరవాన్ని కూడా నిలిపే గర్వపడేందుకు బదులు దేశం పరువుతీయడంతో పాటు తమకు దక్కిన అకాశాన్ని కూడా చేజార్చుకుంటున్నారు.
మ్యాచ్ ఫిక్సింగ్ అరోపణలు ఎదుర్కోంటూ అవినీతికి పాల్పడిన కేసులో ఓ పాకిస్థానీ క్రికెటర్ కు ఇవాళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. క్రికెటర్ పై వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో పాకిస్థానీ వివాదాస్పద క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడు సంవత్సరాల పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిసిప్లినరీ ప్యానల్ ప్రకటించింది. వివరాల్లోకెళితే.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అతను స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు పీసీబీ అవినీతి నిరోధక శాఖ రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
దీంతో అతన్ని పీసీబీ అవినీతి నిరోధక చట్టంలోని ఆర్టికల్ 2.4.4 ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అతన్ని క్రికెట్ నుంచి సస్పెండ్ చేశారు. మార్చి 31వ తేదీ లోపు అతను కోర్టులో విచారణకు హాజరుకావాల్సిందిగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా.. లాహోర్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ.. డిసిప్లినరీ ప్యానల్ జస్టీల్ ఫజల్-ఏ-మిరాన్ చౌహాన్ ఆధ్వర్యంలో జరిగగిన విచారణలో అతనిపై ఉన్న ఆరోపణలు నిజాలని రుజువు కావడంతో.. అతనికి మూడేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. షేర్జీల్ ఖాన్ తర్వాత అవినీతి కేసులో నిషేధం ఎదురుకుంటున్న రెండో క్రికెటర్‌గా ఉమర్ నిలిచాడు. 2017లో షేర్జీల్ ఖాన్‌పై ఐదు సంవత్సరాల పాటు నిషేధం పడింది.
Umar Akmal handed three-year ban from all cricket by Chairman of the Disciplinary Panel Mr Justice (retired) Fazal-e-Miran Chauhan.
— PCB Media (@TheRealPCBMedia) April 27, 2020
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more
Apr 27 | రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి... Read more
Apr 13 | ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి... Read more
Apr 13 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్... Read more
Apr 13 | ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్... Read more