Kapil Dev says start schools and colleges first వికెట్ల వెనుక ధోనిని రీప్లేస్ చేయడంపై కేఎల్ రాహుల్ కామెంట్స్

Pressure of replacing dhoni behind wickets was immense kl rahul

KL Rahul, MS Dhoni, replacing, behind the wickets, keeping, Team India, Immense Pressure, MSD Fans, Mahendra Singh Dhoni, BCCI, Cricket news, sports news, Cricket, sports

The pressure to replace iconic Mahendra Singh Dhoni behind the stumps was “immense” due to high expectations from fans says K L Rahul, who has been doing the wicket-keeping duty for India in the limited overs format for some time now.

వికెట్ల వెనుక ధోనిని రీప్లేస్ చేయడంపై కేఎల్ రాహుల్ కామెంట్స్

Posted: 04/27/2020 07:27 PM IST
Pressure of replacing dhoni behind wickets was immense kl rahul

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కీపింగ్ బాధ్యతలు తీసుకోవడం అంత సులువేం కాదని అంటున్నాడు కేఎల్ రాహుల్. అభిమానుల నుంచి ధోనీ స్థాయి అంచనాలు తట్టుకుని వికెట్ కీపింగ్ లో రాణించాలి.పరిమిత ఓవర్ల ఫార్మాట్లో చాలా కష్టంతో కూడుకున్న పని. 2014లో టెస్టు ఫార్మాట్ కు ధోనీ వీడ్కోలు చెప్పేశాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన పరిమిత్ ఓవర్ల వన్డే వరల్డ్ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ లోనూ ఆడింది లేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగినప్పటి నుంచి కేఎల్ రాహుల్ కీపర్ గా రాణిస్తున్నాడు.

ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్ టూర్ తోనూ రాహులే కీపర్ గా వ్యవహరించాడు. ఈ మేరకు బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. అతడినే జట్టులోకి ఎంపిక చేసింది. కీపర్ గా ఉన్నంతసేపు కాస్త భయంగా ఉంటుంది. ఎందుకంటే అభిమానుల అంచనాలు. ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం, లెజెండ్ వికెట్ కీపర్ స్థానాన్ని చేరుకోవడం కష్టమే. స్టంప్స్ వెనుక మరెవరున్నా వారు త్వరగా ఒప్పుకోలేదరు. క్రికెట్ ఫాలో అయ్యే వాళ్లకు మాత్రమే తెలుసు. నేను క్రికెట్ కు దూరంగా కాలేదని. ఐపీఎల్ కు ఆడినప్పుడు కీపింగ్ గ్లౌజులు వేసుకున్నా.

కర్ణాటకకు ఆడిన ప్రతిసారి కీపింగ్ చేస్తాం. వికెట్ కీపింగ్ తో టచ్ లోనే ఉంటా. జట్టుకు నా అవసరం ఉంది కాబట్టే కీపింగ్ చేస్తున్నా' అని అన్నాడు. ధోనీ కెరీర్ సందిగ్ధంలో ఉంది. రిటైర్మెంట్ ఇస్తాడా ఎప్పుడిస్తాడనే దానిపైనే ప్రశ్నలు తిరుగుతున్నాయి. చాలా మంది మాజీలు మాత్రం అతను రిటైర్ అయితే జాతీయ జట్టుకు తీరని లోటని చెప్తున్నారు. ధోనీ స్థానం భర్తీ చేయడం అంత సులువేం కాదని... ఆస్ట్రేలియాలో జరిగే టీ20వరల్డ్ వరకూ ఉండాలని కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KL Rahul  MS Dhoni  replacing  behind the wickets  keeping  Team India  Immense Pressure  MSD Fans  BCCI  Cricket  sports  

Other Articles