Injury scare for Pandya ahead of World Cup warm-up match పాండ్యాను వెంటాడుతున్న గాయం..

Injury scare for hardik pandya ahead of world cup warm up match against bangladesh

Hardik Pandya, world cup 2019, cricket World Cup 2019, ICC WORLD CUP 2019, ICC World Cup 2019 warm-up, Team India, Virat Kohli, MS Dhoni, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian all-rounder Hardik Pandya has suffered an injury scare ahead of the 2019 ICC World Cup warm-up match against Bangladesh, which is to take place today.

హార్థిక్ పాండ్యాను వెంటాడుతున్న గాయం..

Posted: 05/28/2019 04:01 PM IST
Injury scare for hardik pandya ahead of world cup warm up match against bangladesh

టీమిండియా వరల్డ్ కప్ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక కావడంతో అతని ఫ్యాన్స్ కు ఎంతో సంతోషపెట్టింది. అయితే ప్రస్తుతం ఆయన గురించిన ఓ చేదువార్త కూడా వినిపిస్తోంది. ఏంటావార్త అంటారా.? ఆయన ప్రస్తుతం గాయపడ్డారు. ప్రాక్టీసు సెషన్ లో గాయం కావడంతో.. పాండ్యా మ్యాచుకు అందుబాటులో లేకపోవడం అతని అభిమానులను వెలితికనిపిస్తోంది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరగనున్న రెండో వార్మప్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ప్రాక్టీస్ చేసింది.

ఫీల్డింగ్‌లో సరదాగా పాల్గొన్న క్రికెటర్లు వికెట్లను టార్గెట్ చేస్తూ.. ప్రాక్టీస్ చేస్తున్నారు. కుల్దీప్ యాదవ్, శిఖర్ ధావన్, యుజ్వేంద్ర చాహల్‌లు స్టంప్‌ల వైపు బంతులు విసురుతూ.. ప్రాక్టీస్ ను ముగించారు. ఆ తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నారు. విరాట్ కోహ్లీ ముందుగా బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత కేదర్ జాదవ్, విజయ్ శంకర్‌లు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్‌లో మెరిశారు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. కోహ్లీ బ్యాట్ తీసుకుని స్పిన్నర్లతో ప్రాక్టీస్ చేశాడు.

అంతా చక్కగా జరుగుతుండగా హార్దిక్ పాండ్యా బ్యాట్ తీసుకుని స్పెషలిస్టులతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. టీమిండియా ఫేసర్ వేసిన బంతి అదుపుతప్పి పాండ్యా ఎడమ మోచేతికి తగిలింది. దీంతో వెంటనే హార్దిక్ ప్రాక్టీస్ సెషన్‌ను వదిలేసి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయాడు. అతని గాయం తీవ్రతపై కానీ, అందుబాటులో ఉండలేకపోవడం గురించి గానీ, ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik Pandya  world cup 2019  ICC WORLD CUP 2019  Team India  sports  cricket  

Other Articles