MS Dhoni Is The Captain Of The Captains విరాట్ కు కలిసిరానున్న ధోని అనుభవం..

Ms dhoni is the captain of the captains suresh raina

India,India National Cricket Team,MS Dhoni,Suresh Raina,Virat Kohli,World Cup 2019, cricket, cricket news, sports news, latest sports news, sports

For Suresh Raina, MS Dhoni will always remain the captain on the cricket field. The senior batsman feels that his former India skipper will continue to be the cricketing brain on the field in the upcoming World Cup.

ప్రపంచకప్ లో విరాట్ కు కలిసిరానున్న ధోని అనుభవం..

Posted: 05/28/2019 08:23 PM IST
Ms dhoni is the captain of the captains suresh raina

టీమిండియా మాజీ సారధి, వికెట్ కీపర్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ పాత్ర ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని రుజువు చేస్తూ ధోనీ అనేకసార్లు వికెట్ల వెనుక ఉండి సలహాలు, సూచనలు చేయడం అనేక సందర్భాల్లో చూశాం. ఇదే విషయాన్ని టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ సురేశ్ రైనా మరోసారి ప్రస్తావించాడు. రైనా మాట్లాడుతూ.. ‘ధోనీ పేపర్‌ మీద కెప్టెన్‌ కాదు. గ్రౌండ్ లో మాత్రం విరాట్ కోహ్లీకి అతడే సారథి. ఇప్పటికీ ధోనీ పాత్ర అలాగే ఉందని అన్నారు.

వికెట్ల వెనుక నుంచే బౌలర్లతో మాట్లాడి ఫీల్డింగ్‌ మార్పులూ చేస్తాడని అన్నాడు. ధోని అందరిలా కెప్టెన్సీ నిర్వహించే సారధి కాదన్న రైనా.. ఓ వైపు బౌలర్లకు స్వేచ్చనిస్తూనే కీలక సమయాల్లో సూచనలు చేస్తాడని, అవి అనేక సందర్భాల్లో బౌలర్లకు కలసివచ్చాయన్నారు. అతను కెప్టెన్లకే కెప్టెన్‌ అని అన్నాడు. ధోనీ ఉంటే కోహ్లీకి కొండంత అండ అని చెప్పుకోచ్చాడు. క్లిష్ట సమయాల్లో వ్యూహాత్మకంగా ఆలోచించి మార్పులు చేస్తాడని.. అనేక సందర్భాల్లో ఈ విషయం తేలింది’ అని పేర్కొన్నాడు.

అయితే కోహ్లీ ఆత్మవిశ్వాసంతో ఆడతాడని, కెప్టెన్ గానూ అలాగే ఉంటాడని రైనా తెలిపాడు. ఈ ప్రపంచకప్‌ అతడికి పెద్ద అవకాశమని, ఈ సమయంలో తన పాత్ర ఏంటో కోహ్లీకి తెలుసని చెప్పాడు. అలాగే జట్టులోని మిగతా ఆటగాళ్లకూ అదే నమ్మకాన్ని కలిగించాలని సూచించాడు. అన్ని అంశాలూ అనుకూలంగా ఉన్నాయని, ఆశావాహదృక్పథంతో ముందుకుసాగితే ఇదే అత్యుత్తమ జట్టని రైనా కితాబిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  India National Cricket Team  MS Dhoni  Suresh Raina  Virat Kohli  World Cup 2019  cricket  

Other Articles