Shoaib Malik Smashing the Stumps With His Bat నెట్టింట్లో షోయబ్ మాలిక్ ట్రోల్.. గుడ్ హిట్.. వికెట్..!

Twitter left in splits as shoaib malik clatters his own stumps

England vs Pakistan ODI series, Shoaib Malik, hit wicket cricket, Jason Roy, Ben Stokes, 2019 World Cup cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

England vs Pakistan 4th ODI: Shoaib Malik who was looking to finish the Pakistan innings on a high, got dismissed after he smashed his stumps while trying to play a late square cut of Mark wood's delivery

నెట్టింట్లో షోయబ్ మాలిక్ ట్రోల్.. గుడ్ హిట్.. వికెట్..!

Posted: 05/18/2019 06:56 PM IST
Twitter left in splits as shoaib malik clatters his own stumps

పాకిస్థాన్‌ జట్టు సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో షోయబ్ ఔటయిన విధానమే ఇందుకు కారణం. ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదుగా జరిగే ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లాండ్‌ ఫాస్ట్ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ వేసిన బంతిని ఆడాడు. మాలిక్‌ తానున్న స్థానం నుంచి కాస్త వెనకకు వెళ్లి బంతిని కొట్టబోయి ఔటయ్యాడు షోయబ్. ఆ వెనువెంటనే తాను ఔటయిన విధానం అంచనా వేసుకుని విస్మయానికి గురయ్యాడు.

అతనే కాదు ఆయనకు బంతివేసి ఔట్ చేసిన బౌలర్ సహా జట్టు మొత్తం ఆశ్చర్యపోయాంది. ఇందుకు కారణమేంటో తెలుసా.. బంతిని కొట్టేందుకు బదులు ఆయన వికెట్లను కొట్టడమే. అత్యంత అరుదుగా హిట్ వికెట్ మనకు కనబడుతుంది. కానీ ఈయన ఒకటి కాదు రెండు వికెట్ల కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్‌ క్రికెట్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఇది బాగా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు మాలిక్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

‘క్రీజులో ఉన్నప్పుడు బంతిని కొట్టాలి కానీ.. స్టంప్స్‌ను కొట్టకూడదు’, ‘పాక్‌ క్రికెటర్లు మాత్రమే ఇలా ఆడి ఔటవ్వగలరు. వీళ్లు మైదానంలో కావల్సినంత వినోదాన్ని పంచుతారు’, ‘షోయబ్‌..నువ్వాడేది టెన్నిస్ కాదు..క్రికెట్‌’ అంటూ అతని సతీమణి భారత్ స్టార్ షెట్లర్ సానియా మిర్జాను కూడా పరోక్షంగా ప్రస్తావనకు తీసుకువస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం శహబాష్ షోయబ్.. గుడ్ హిట్.. వికెట్ అంటూ కామెంట్లతో తలంటేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles