India beat New Zealand with 90 runs, lead ODI series 2-0 రెండో వన్డేలోనూ టీమిండియా విజయం.. కుల్దీప్ మాయాజాలం

India vs new zealand 2nd odi kuldeep yadav bamboozles kiwis as india take 2 0 lead

ms dhoni, Rohit sharma, Kuldeep Yadav, India vs New Zealand ODI Series, Team India, Virat Kohli, MS Dhoni, Kedar Jadhav, Yazuvendra chahal, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Wrist-spinner Kuldeep Yadav tormented New Zealand again as India coasted to a 90-run victory in the second one-day international at Bay Oval in Mount Maunganui to take a 2-0 lead in the five-match series.

రెండో వన్డేలోనూ టీమిండియా విజయం.. కుల్దీప్ మాయాజాలం

Posted: 01/26/2019 06:22 PM IST
India vs new zealand 2nd odi kuldeep yadav bamboozles kiwis as india take 2 0 lead

అతిధ్యజట్టు న్యూజీలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన రెండో వన్డే లోనూ భారత జట్టు జైత్రయాత్ర కొనసాగించింది. న్యూజీలాండ్ పై ఏకంగా తొంబై పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. మౌంట్ మాంగనూయి మైదానం వేదికగా జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుని న్యూజీలాండ్ బౌలర్లపై వీరవిహారం చేసింది. లక్ష్యచేధనలో చతికిలపడిన కివీస్ 234 స్కోరుకే చాపచుట్టేశారు. దీంతో రెండో మ్యాచ్ లోనూ టీమిండియా ఘనవిజయాన్ని నమోదు చేసింది.

న్యూజీలాండ్ తో జరిగిన తొలి 50 ఓవర్ల మ్యాచులో అంతగా రాణించలేని టీమిండియా హిట్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ.. రెండో వన్డేలో మాత్రం అద్భుతంగా రాణించాడు. దీంతో టీమిండియా ఓపెనర్లు ధాటిగా అడటం ప్రారంభించి భారత్ స్కోరును పరుగులు పెట్టించడంతో.. దానిని అందుకునే లక్ష్యంలో న్యూజీలాండ్ చతికిలపడింది. సొంతగడ్డపై తిరుగులేని రికార్డు ఉన్న న్యూజిలాండ్‌ను మరో వన్డేలో చిత్తుగా ఓడించి కోహ్లీసేన సత్తా చాటింది.

లక్ష్య ఛేదనలో ఓపెనర్ మార్టిన్ గప్తిల్(15)ను ఔట్ చేసి భువనేశ్వర్ భారత్‌కు శుభారంభం అందించాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో నిలకడగా కనీసం 50కి పైగా పరుగులు సాధిస్తూ వస్తున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రీజులోకి రాగానే వేగంగా ఆడాడు. రెండు సిక్సర్లు బాది జోరు మీదున్న కేన్‌ను షమీ బౌల్డ్ చేయడంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాతమరో విధ్వంసకర ఓపెనర్ మున్రో(31)ను చాహల్ ఎల్బీడబ్లూగా వెనక్కి పంపడంతో 84 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది.

కుల్దీప్ తన స్పిన్ మాయాజాలంతో మిడిలార్డర్ పుంజుకోకుండా కివీస్ ఆటగాళ్లు టామ్ లాథమ్(34), హెన్రీ నికోల్స్(28), గ్రాండ్ హోం(3)లను పెవిలియన్ పంపి టీమిండియాకు విజయాన్ని ఖరారు చేశాడు. ఆఖర్లో బ్రాస్‌వెల్(57: 46 బంతుల్లో) ఫోర్లు, సిక్సర్లతో అర్ధశతకంతో మెరిసినా ప్రయోజనం లేకపోయింది. రెండో వన్డేలో భువనేశ్వర్ కుమార్(2/42), చాహల్(2/52) చైనామన్ బౌలర్ కుల్దీప్(4/45) యాదవ్‌ల ధాటికి కివీస్ 40.2 ఓవర్లలో 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 324 పరుగుల భారీ స్కోరు చేసింది. కివీస్ బౌలర్లపై విరుచుకుపడి భారత ఆటగాళ్లు తమదైన శైలిలో పరుగులు రాబట్టారు. ఓపెనర్లు రోహిత్ శర్మ(87), శిఖర్ ధావన్(66) అర్ధశతకాలతో చెలరేగారు. అర్థశతకాన్ని నమోదు చేసుకుని శతకంపైపు పరుగులు తీసే క్రమంలో రోహిత్ శర్మ వెనుదిరిగాడు.

అతడికి జోడిగా దిగిన శిఖర్ ధావన్ కూడా అద్బుత ప్రదర్శనతో రాణించి హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ప్రదర్శనలో మాత్రం జోరు తగ్గలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(43), అంబటి రాయుడు(47), ధోనీ(48 నాటౌట్), కేదార్ జాదవ్(22 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. మొదటి ఐదుగురు బ్యాట్స్‌మెన్ అందరూ 40కి పైగా స్కోరు సాధించడం భారత క్రికెట్లో ఇదే తొలిసారి కావడం విశేషం. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఫర్గుసన్ చెరో రెండు వికెట్లు తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  Virat Kohli  Rohit sharma  Kuldeep Yadav  sports  cricket  

Other Articles