BCCI lifts suspension on Hardik Pandya, KL Rahul పాండ్యా, రాహుల్ లపై సస్పెన్షన్ ఎత్తవేత..

Hardik pandya kl rahul suspensions lifted with immediate effect coa

hardik pandya suspension revoked, pandya suspension revoked, kl rahul suspension, bcci pandya suspension, kl rahul suspension revoked, cricket news, sports news,sports, latest sports news, cricket news, cricket

The Committee of Administrators (CoA) of the BCCI lifted the suspension on Hardik Pandya and KL Rahul, who were suspended from the Indian team for their inappropriate remarks on women

పాండ్యా, రాహుల్ లపై సస్పెన్షన్ ఎత్తవేత.. న్యూజీలాండ్ పయనం..

Posted: 01/24/2019 07:29 PM IST
Hardik pandya kl rahul suspensions lifted with immediate effect coa

భారత యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ కి ఊరట లభించింది. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో అనుచిత వ్యాఖ్యలు చేసి వేటుకి గురైన ఈ ఇద్దరు క్రికెటర్లపై ఉన్న సస్పెన్షన్‌‌ని తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు బీసీసీఐ పాలకుల కమిటీ ఈరోజు ప్రకటించింది. సస్పెన్షన్‌ కారణంగా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే భారత్ కి వచ్చేసిన హార్దిక్, రాహుల్.. న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లేందుకు తాజాగా మార్గం సుగుమమైంది.

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న‘కాఫీ విత్ కరణ్’ షోకి హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ మహిళల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో వీరిపై వేటు పడింది. అయితే హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసును విచారించేందుకు అంబుడ్స్‌మన్‌ని నియమించాలని ఇటీవల బీసీసీఐ పాలకుల కమిటీ సుప్రీంకోర్టుని అభ్యర్థించింది.

కాగా.. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంలో అంబుడ్స్ మెన్ బదులుగా కమిటీకి సహాయకుడిగా మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సింహను మాత్రమే నియమించింది. తాజాగా అతనితో చర్చించే సస్పెన్షన్‌ ని ఎత్తివేసినట్లు కమిటీ ప్రకటించింది. టాక్ షోలో తాము చేసిన వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్ ఇప్పటికే క్షమాపణలు కోరిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hardik pandya  kl rahul  suspension revoked  COA  cricket news  Indian Cricket Team  Cricket  

Other Articles