అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ ప్రారంభమైన తొలిటెస్టులో చావు తప్పి కన్ను లొట్టపోయిందన్న చందంగా పూర్తిగా చేతులెత్తేసినా.. గౌరవప్రదమైన స్కోరును ఎట్టకేలకు సాధించింది. తొలిరోజు అద్యంతం అసీస్ బౌలర్ల హవా కొనసాగింది. కంగారు బౌలర్లు టీమిండియా బ్యాట్స్ మెన్ ను కంగారుపెట్టడంలో సఫలీకృతమైనా.. ఒంటి చేత్తో మ్యాచ్ తొలిరోజున టీమిండియాను చెప్పకోదగిన స్కోరుకు చేర్చాడు ఛట్టేశ్వర్ పూజరా. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 250 రన్స్ చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేయడంతో లంచ్ టైంకు నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 56 రన్స్ మాత్రమే చేసింది.నాలుగు వికెట్లు కోల్పోయిన టైంలో క్రీజ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ-రిషబ్ పంత్‌లు కాసేపు టీంను ఆదుకునే ప్రయత్నం చేశారు. తర్వాత వీరిద్దరూ ఔటవ్వడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. అయితే తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఛటేశ్వర్ పూజారా తన సూపర్ సెంచరీ(123)తో టీమిండియాను ఆదుకున్నాడు.
ఈ సెంచరీతో పూజారా తన టెస్ట్ కెరీర్ లో 16వ సెంచరీని కంప్లీట్ చేశాడు.ఒకవైపు పేస్ అటాక్‌ను, మరొకవైపు స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆసీస్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. భారత టీంలో లోకేష్ రాహుల్ (2), మురళీ విజయ్ (11), పూజారా(123), విరాట్ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్(25), అశ్విన్(25), ఇషాంత్ శర్మ(4) రన్స్ చేశారు. ప్రస్తుతం క్రీజ్‌లో షమీ (6), బుమ్రా (0) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో, మిచెల్ స్టార్క్,హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్ , నాథన్ లియాన్ రెండేసి వికెట్లు తీశారు.
There it is, a brilliant ton for Cheteshwar Pujara from 231 balls!
That's his 16th hundred in Test cricket and third against Australia.#AUSvIND | @Domaincomau pic.twitter.com/cD1rSObzGq
— cricket.com.au (@cricketcomau) December 6, 2018
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more
Apr 27 | రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి... Read more
Apr 13 | ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి... Read more
Apr 13 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్... Read more
Apr 13 | ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్... Read more