Jake Weatherald's bizarre dismissal హిట్ వికెట్ చిరాకు తెప్పించినా.. నవ్వును అపలేరు..

Australia s jake weatherald left embarrassed after hit wicket

bizarre hit-wicket dismissal, Hit Wicket, Jake Weatherald, Jake Weatherald hit wicket, National Performance Squads, Victoria, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

When it comes to embarrassing dismissals in cricket, hit-wicket tops the list. Left-handed batsman Jake Weatherland faced such inccident while, playing for NPS against Victoria in Australia.

హిట్ వికెట్ చిరాకు తెప్పించినా.. నవ్వును అపలేరు..

Posted: 09/05/2018 04:22 PM IST
Australia s jake weatherald left embarrassed after hit wicket

క్రికెట్ లో బ్యాట్స్ మెన్లు అత్యధికంగా ఇబ్బంది పెట్టే సంఘటన తమ తప్పు ఏ మాత్రం లేకున్నా.. యాధృశ్చికంగా హిట్‌ వికెట్ కాబడి బ్యాట్స్ మెన్లు వెనుదిరగడం. బ్యాట్‌, కాలు, ఒక్కోసారి హెల్మెట్‌ వికెట్లను తగిలి హిట్‌ వికెట్ గా ఆటగాళ్లు మూల్యం చెల్లించుకుంటారు. ‌అయితే ఒక్కోసారి ఇలా వెనుదిరగడం వారికి ఇబ్బందిగా పరిణమించినా.. కాసేపయ్యాక మాత్రం.. అది ఫన్నీగా అనిపిస్తుంది. ఇలాంటిదే ఓ ఘటన ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ కు చోటుచేసుకుంది.

ఎన్పీసీ, విక్టోరియా జట్ల మధ్య ప్రాక్టీస్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఆసీస్‌ ఆటగాడు జేక్‌ వెదరాల్డ్‌ బ్యాటింగ్‌ చేస్తూ ఫ్రంట్‌ ఫూట్‌ డ్రైవ్‌కు యత్నించాడు. అయితే అది కాస్తా గురితప్పింది. ఈ ఎడమ చేతి బ్యాట్స్ మెన్‌ చేతిలోంచి బ్యాట్‌ గాల్లోకి ఎగిరింది. తన తలమీదుగా ఎగురుతూ బ్యాట్‌ లెగ్ స్టంప్ పై పడి బెయిల్స్‌ కిందపడ్డాయి. దీంతో అతను ఔట్‌ అంటూ అంపైర్‌ ప్రకటించాడు. అయితే బ్యాట్స్ మన్‌ క్రీజులోనే ఉండి అసలేం జరిగిందో తెలీక ముక్కున వేలేసుకుని చూస్తూ అలా కాసేపు ఉండిపోవడం విశేషం.

ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారిక ట్విటర్ లో పెట్టగా అదికాస్తా వైరల్ గా మారింది. జేక్‌ ఎలా వెనుదిరిగాడో ఒకసారి చూడండి అంటూ క్యాప్షన్‌ కూడా పెట్టింది. ఈ ట్వీట్ కు రీప్లై ఇస్తూ ఎన్‌ఎస్‌డబ్ల్యూ క్రికెట్‌ క్లబ్‌.. ఇలాంటిదే మరో ఘటనను షేర్‌ చేసింది. జేక్‌ వార్తల్లో నిలవడం ఇదే తొలిసారేం కాదు. ఈ ఏడాది జనవరిలో జరిగిన బిగ్ బాష్‌ లీగ్ లో అద్భుతమైన రీతిలో క్యాచ్‌ పట్టి అందరి మన్నలను పొందాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles