Mithali Raj adds yet another feather to her cap వన్డేలలో మిథాలీ రాజ్ మరో చరిత్ర..

Mithali raj breaks the record for most appearances in women s odis

Charlotte Edwards, Womens cricket, Indian cricket, Mithali Raj, Mithali Raj world record, mithali raj most capped player, mithali raj record, india womens cricket, womens cricket record, cricket, cricket news, sports news, latest sports news, sports

Indian captain, Mithali Raj became the most capped player in the world, turning out for the 192nd time when she led India out to play England in the first match of their ODI series in Nagpur.

వన్డేలలో మిథాలీ రాజ్ మరో చరిత్ర..

Posted: 04/06/2018 07:54 PM IST
Mithali raj breaks the record for most appearances in women s odis

భారత మహిళల క్రికెట్‌ జట్టు సారథి మిథాలీ రాజ్‌ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డును తన పేరున లిఖించుకుంది. టీమిండియా జట్టు కెప్టెన్ గానే కాకుండా ఒక క్రికెటర్ గా కూడా అమె టీమిండియా విజయాల్లో తన అద్బుత ప్రతిభతో కీలక పాత్ర పోషించారు. అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్ట్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

ఇప్పుడు మిథాలీ రాజ‌.. ఎడ్వర్ట్స్ ను రికార్డును దాటిసి తన పేరును తాజాగా కొత్త రికార్డును లిఖించుకున్నారు. నాగ్ పూర్ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్ మహిళల మధ్య తొలి వన్డే జరుగుతోంది. ఈ వన్డే మిథాలీ రాజ్ కు 192 వది. దీంతో అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. 1999 జూన్ లో మిథాలీ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. 192 వన్డేల్లో మిథాలీ 6,295 పరుగులు చేసింది. 10 ఇన్నింగ్స్ ల్లో బౌలింగ్‌ చేసి 8 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్‌లో 6వేల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్ గా కూడా మిథాలీ.. ఇప్పటికే తన పేరున రికార్డును రాసుకుంది. రెండుసార్లు భారత జట్టును ప్రపంచకప్ ఫైనల్ కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ మిథాలీ రాజ్ కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles