Kohli, Rahane's masterclass takes visitors home డర్బన్ వన్డేలో భారత్ ఘనవిజయం

India vs south africa kuldeep chahal virat kohli s new trump cards

AB de Villiers, Cricket, Faf du Plessis, India, India Vs South Africa, MS Dhoni, ODI, Proteas, Quinton de Kock, Rohit Sharma, South Africa, South Africa vs India, South Africa vs India 2018, Virat Kohli

An unbeaten century from skipper Virat Kohli and steady batting by Ajinkya Rahane propelled India to a six-wicket victory in the first ODI against South Africa

విరాట్ విశ్వరూపం.. డర్బన్ వన్డేలో భారత్ ఘనవిజయం

Posted: 02/02/2018 04:29 PM IST
India vs south africa kuldeep chahal virat kohli s new trump cards

అతిత్య జట్టు దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న నేపథ్యంలో వరుసగా విమర్శలను ఎక్కుపెట్టిన సీనియర్లు, నెట్ జనులకు తన బ్యాటుతోనే బదులివ్వాలని భావించిన టీమిండియా కెప్టెన్ అదే పనిచేశాడు. వన్డే సిరీస్ లో భాగంగా డర్భన్ వేదికగా కింగ్స్ మీడ్ మైదానంలో జరిగిన తొలివన్డేలో టీమిండియాను కెప్టెన్ ఇన్నింగ్స్ అడి విజయతీరాలకు చేర్చాడు. అదే సమయంలో తనపై వచ్చిన విమర్శలకు శతకంతో బదులిచ్చాడు.

డర్భన్ లో టీమిండియా ట్రాక్ రికార్డు పేలవంగా వున్నా.. ఈ మ్యాచ్ సఫారీల చేతుల్లోకే వెళ్తుందని అంచనాల నేపథ్యంలో విరాట్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అతనికి తోడుగా అజింక్య రహానే కూడా బాగా రాణించాడు. నంబర్ నాలుగో స్థానంలో అతనిదేనని అంతకుముందే చెప్పుకోచ్చిన విరాట్ సహా జట్టు యాజమాన్యం అంచనాలకు తగ్గటుగా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు రహానె.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంపై కన్నేసిన టీమిండియాకు వన్డే సిరీస్‌లో అదిరే ఆరంభం లభించింది. కెప్టెన్‌ కోహ్లి (112; 119 బంతుల్లో 10×4), రహానె (79; 86 బంతుల్లో 5×4, 2×6) అదరగొట్టడంతో తొలి వన్డేలో టీమ్‌ ఇండియా 6 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. మొదట స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (3/34),  చాహల్‌ (2/45) మాయ చేయడంతో దక్షిణాఫ్రికాను భారత్‌ 269/8కి కట్టడి చేసింది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (120; 112 బతుల్లో 11×4, 2×6) సెంచరీతో దక్షిణాఫ్రికాను ఆదుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియాలో రోహిత్ శర్మ కేవలం 20 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ కు చేరగా, అతని వెంటనే మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా 35 పరుగులకు వెనుదిరిగాడు. దీంతో  బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లి- అజింక్య రహానెలు అద్భుత భాగస్వామ్యం (189)తో లక్ష్యాన్ని 45.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఆరు  మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సంపాదించింది. రెండో వన్డే ఆదివారం సెంచూరియన్ లో జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Vs South Africa  MS Dhoni  ODI  Proteas  Virat Kohli  Rohit Sharma  cricket  

Other Articles