India disappointed over Johannesburg ground పైనల్ టెస్టు ముందు టీమిండియా అసంతృప్తి.. !

India disappointed over training wickets at johannesburg

India vs South Africa 2018, South Africa, Indian cricket team, johannesburg pitch, sanjay bungar, Ravi shastri, India, India national team, Virat Kohli, Graeme Smith, Proteas, India South Africa, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news, sports, latest sports news, cricket

India’s head coach Ravi Shastri had complained of an uneven wicket, who then called Butuel Buthelezi, the pitch curator and asked him to roll the wickets again.

పైనల్ టెస్టు ముందు టీమిండియా అసంతృప్తి..

Posted: 01/23/2018 08:16 PM IST
India disappointed over training wickets at johannesburg

ఆతిథ్య దక్షిణాఫ్రికాతో చివరి టెస్టుకు కోహ్లీ సేన సిద్ధమౌతోంది. జొహాన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ మైదానంలో బుధవారం నుంచి చివరి టెస్టు మ్యాచు ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే వాండరర్స్‌ మైదానంలో కోహ్లీ సేన కసరత్తులు చేస్తోంది. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పిచ్ పై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ పిచ్ ప్రాక్టీస్‌ చేసేందుకు అనుకూలంగా లేదని గమనించిన ఆయన ప్రధాన కోచ్ రవిశాస్త్రికి కూడా విషయాన్ని చేరవేశాడు.

మూడో టెస్టు కోసం ఆదివారం నుంచి టీమిండియా ప్రాక్టీస్‌ మొదలెట్టింది. సాధన కోసం ఏర్పాటు చేసిన మూడు ప్రాక్టీస్‌ వికెట్లను చూసి.. రవిశాస్త్రికి ఫిర్యాదు చేశాడు. వెంటనే శాస్త్రి పిచ్ క్యూరేటర్ తో మాట్లాడి వికెట్లను రీ రోలింగ చేయాలని కోరాడు. దీంతో క్యూరేటర్ వెంటనే సిబ్బందిని పిలిచి వికెట్లను రీ రోలింగ్ చేశాడు. అనంతరం యథావిధిగా ఆటగాళ్లు ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. వాండరర్స్‌ మైదానం పేసర్లకు బాగా అనుకూలం. ఇప్పటికే ఈ పిచ్ బౌన్సింగ్ బంతులకు అనువైనదని, పేసర్లకు అనుకూలంగా వుంటుందని కూడా క్యూరేటర్ మీడియాకు చెప్పాడు.

ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్‌కు కేటాయించిన వికెట్లపై బంతి ఆశించిన స్థాయిలో బౌన్స్‌ అవ్వకపోవడాన్ని గమనించే రీ రోలింగ్‌ చేయించాలని రవిశాస్త్రిని కోరినట్లు బంగర్‌ తెలిపాడు. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో చివరి టెస్టు బుధవారం ప్రారంభంకానుంది. ఇప్పటికే 0-2తో భారత్‌ సిరీస్‌ను చేజార్చుకుంది. వాండరర్స్‌ మైదానం టీమిండియాకు అచ్చొచ్చిన మైదానంగా పేరొందింది. ఇక్కడ నాలుగుసార్లు తలపడగా ఒక మ్యాచులో విజయం కైవసం చేసుకోగా మూడింటిని డ్రా చేసింది. చివరి టెస్టులో ఎవరు విజయం సాధిస్తారో తెలియాలంటే వేచి చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles