Michael Vaughan trolled mercilessly by dhoni fans మాజీ కెప్టెన్ కు చుక్కులు

Ms dhoni is god jos buttler is human fans slam michael vaughan

ms dhoni, India, Dhoni, Michael Vaughan, Vaugh, Jos Butler, Butler, troll, Twitter, sports news, cricket news, cricket, sports

Former England captain Michael Vaughan was slammed by fans on Twitter after he asked to choose between India limited-overs wicket-keeper Mahendra Singh Dhoni and England's glovesman Jos Buttler on social media.

మాజీ కెప్టెన్ కు ధోని అభిమానుల చుక్కలు..

Posted: 01/24/2018 06:51 PM IST
Ms dhoni is god jos buttler is human fans slam michael vaughan

టీమీండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫ్యాన్ ఫాలొయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌కు ఎన్నో చరిత్రాత్మక విజయాలు అందించిన ఈ కెప్టెన్ కూల్‌ కెప్టెన్సి నుంచి తప్పుకున్న అతనికున్న ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ధోని ఫ్యాన్స్ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాగాన్ విరుచుకుపడ్డారు. వాగాన్ ట్విట్టర్ వేదికగా ధోనికి, ఇంగ్లాండ్ కీపర్ జాస్ బట్లర్‌కి మధ్య ఓ పోల్ నిర్వహించారు. ‘‘మీరు ఏమని ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఫాం ఆధారంగా మీ టీంలో వీళ్లద్దరిలో ఒకరిని తీసుకోవాలంటే మీరు ఎవరిని ఎంచుకుంటారు’’ అని ధోని, బటర్ల‌ పేర్లతో పోల్ పెట్టారు.

దీనిపై ధోని ఫ్యాన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ బట్లర్ తాజాగా సెంచరీ చేసి ఉండొచ్చు.. కానీ 2017లో ధోని యావరేజ్ 60.62. ప్రస్తుత ఫాంకి ఇది సమాధానం. ఇక స్టంప్ అంటారా.. ధోని రెప్పపాటులో స్టంప్ చేసేస్తాడు’’ అని ఓ అభిమానికి వాగాన్ పోల్‌కి రిప్లే ఇచ్చాడు. ‘‘బట్లర్ ఓ సామాన్య మనిషి, కానీ ధోని క్రికెట్‌కి దేవుడు. ధోనిలా స్టంప్ చేయాలంటే బట్లర్ ఇంకో ఏడు జన్మలెత్తాలి’’ అని ఇంకో అభిమాని ట్వీట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ms dhoni  India  Dhoni  Michael Vaughan  Jos Butler  troll  Twitter  sports news  cricket  

Other Articles