Team India hit the nets before Johannesburg match చమటోడుస్తున్న టీమిండియా..

India vs south africa 3rd test team india hit the nets before johannesburg match

India vs South Africa 2018, South Africa, Indian cricket team, India, India national team, Virat Kohli, Graeme Smith, Proteas, India South Africa, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news, sports, latest sports news, cricket

Ahead of the third test match with South Africa, the ‘Men in Blue’ sweated it out and brushed up their skills. Team India will lock horn with South Africa on a third Test match which is about to begin in Johannesburg

పరువు కోసం విరాట్ సేన ముమ్మర ప్రాక్టీసు..

Posted: 01/23/2018 07:34 PM IST
India vs south africa 3rd test team india hit the nets before johannesburg match

సౌతాఫ్రికాతో లాస్ట్ టెస్ట్ కు టీమిండియా రెడీ అయింది. ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న సౌతాఫ్రికా.. ఈ మ్యాచ్ లో గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు చివరి టెస్ట్ గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది కోహ్లీ సేన. బుధవారం (జనవరి-24) జోహాన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న మూడో టెస్టు కోసం రెండు జట్లు సమాయత్తం అవుతున్నాయి. సౌతాఫ్రికాతో మరో ఫైట్ కు రెడీ అయ్యింది టీమిండియా. మూడు టెస్టుల్లో భాగంగా బుధవారం నుంచి చివరి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిరీస్ ను దక్కించుకున్న సౌతాఫ్రికా.. లాస్ట్ టెస్టులోనూ గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.

మరోవైపు వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓడిన టీమిండియా చివరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకొనే ప్రయత్నంలో ఉంది. జొహన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో జరిగే చివరి టెస్టు కోసం.. రెండు జట్లు రెడీ అయ్యాయి. మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. మరోవైపు రెండు టెస్టుల్లోనూ చోటు దక్కని రహానే.. మూడో టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్లలో రహానే ఎక్కువ టైం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయటంతో చివరి టెస్ట్ లో చోటు దక్కడం ఖాయమనిపిస్తోంది.

చివరి టెస్ట్ కు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆడటం అనుమానంగానే ఉంది. నెట్ ప్రాక్టీస్ లో ఇషాంత్ శర్మ వేసిన బంతి మోకాలికి తగలడంతో రాహుల్ గాయపడ్డాడు. మూడో టెస్టుకు రాహుల్ పూర్తిగా కోలుకోకపోతే.. అతని స్థానంలో మురళీ విజయ్ తో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశముంది. లాస్ట్ టెస్ట్ కు సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ బావుమా దూరమయ్యాడు. ఉంగరం వేలికి గాయం కావటంతో నాలుగు వారాలు రెస్ట్ అవసరమని టీమ్ ఫిజియో చెప్పారు. బావుమా ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలో దక్షిణాఫ్రికా ఇంకా తేల్చుకోలేదు. అయితే ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ను తుది జట్టులోకి తీసుకొని ఒక బౌలర్ ను తప్పించాలని సౌతాఫ్రికా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs South Africa  Virat Kohli  Faf du Plessis  Proteas  team india  cricket  

Other Articles