టీమిండియాతో టీ20 సిరీస్ లో భాగంగీ ఈ నెల 7న తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో ఆసీస్ జట్టు కష్టాల్లో పడింది. జట్టు కెప్టెన్ స్టీవ్ స్మీత్ జట్టుతో ప్రాక్టీసు చేస్తున్న క్రమంలో అతని భూజానికి గాయమైంది. ప్రాక్టీసు సమయంలో గాయం పాలైన క్రీకెటర్ల జాబితాలో స్మీత్ కూడా చేరాడు. అయితే అప్రమత్తమైన జట్టు యాజమాన్యం స్మిత్ ను ఆస్పత్రికి తరలించారు. ఎమ్మారై స్కాన్ నిర్వహించిన వైద్యులు గాయం తీవ్రమైందేమీ కాదని చెప్పాడంతో జట్టు మేనేజ్ మెంట్ ఊపిరి పీల్చుకుంది.
స్మీత్ కు గాయమైన నేపథ్యంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీ20 తొలి మ్యాచ్ కు సిద్ధం కావొచ్చని చెప్పడంతో జట్టులోని మిగతా సభ్యులు తొలి టీ20కి సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాంచీలోని జేఎస్సీఏ మైదానంలో ఆసీస్ ఆటగాళ్లు శుక్రవారం కూడా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. అయితే శుక్రవారం ప్రాక్టీసుకు మాత్రం స్మిత్ దూరంగానే వున్నాడని సమాచారం. ఇప్పటికే అటు టెస్టు, ఇటు వన్డే సిరీస్ లను కొల్పోయి రిక్తహస్తాలతో వున్న అసీస్ జట్టు టీ20లోనైనా రాణించాలని భవిస్తుంది. అయితే విరాట్ సేన మాత్రం టీ20ని సిరీస్ ను కూడా కైవసం చేసుకోవాలన్న కసితో వుంది.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఆస్ట్రేలియా టీమ్ మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ మూడు వారాల పాటు మెంటల హాస్పిటల్లో గడపనున్నాడు. బుధవారం సిడ్నీ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అతన్ని అధికారులు పిచ్చాసుపత్రికి తరలించారు. డొమెస్టిక్ వయొలెన్స్ కింద... Read more
Apr 27 | రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు దొరికిన అత్యుత్తమ స్పిన్నర్. టెస్ట్ క్రికెట్లో దుమ్మురేపుతూ అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే దీర్ఘకాల ఫార్మాట్లోనే కాకుండా పొట్టి... Read more
Apr 13 | ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్ ఛాంపియన్ షిప్లో చోటుచేసుకుంది. అప్పటి... Read more
Apr 13 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనగానే అనేక రకాల విచిత్రాలకు, సాహసాలకు వేదిక అన్న విషయం విధితమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2022లో డిపెండింగ్ చాంఫియన్స్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్... Read more
Apr 13 | ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణి కోట్టింది. వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉన్న జట్టుకు తొలి గెలుపుతో ఉత్సాహం లభించింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీదున్న రాయల్ ఛాలెంజర్స్... Read more