MS Dhoni Could Be Penalised By ICC ఫేక్ ఫీల్డింగ్ నిబంధనతో ధోనిపై వేటు పడనుందా..?

Ms dhoni could be penalised according to this new rule by the icc

MS Dhoni, fake fielding, sanjay manjrekar, ICC new rules, India vs australia, Team India, MS Dhoni, sam, pet dog, sakshi dhoni singh, sakshi singh, virat kohli, steve smith, india cricket team, India Australia, australia vs india, cricket news, sports news, sports, cricket

MS Dhoni was famous for the way he would trick batsmen that he was collecting a throw and then let the ball hit the stumps to run them out.

ధోనిపై వేటు పడనుందా..? ఐసీసీపై మండిపడ్డ మంజ్రేకర్

Posted: 10/06/2017 06:15 PM IST
Ms dhoni could be penalised according to this new rule by the icc

క్రికెట్ లో నిబంధనలను మరింత కఠినం చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ దిగ్గజాల నుంచి నిరసనలు, అసంతృప్తులు వ్యక్తం అవుతూనే వున్నాయి. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఈ విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా మంజ్రేకర్ పలు పోస్టులు పెడుతూ, ఫేక్ ఫీల్డింగ్ నిబంధనను మరోసారి పరిశీలించాలని డిమాండ్ చేశాడు. ఇది తప్పుదారి పట్టించడం కాదని, బ్యాట్స్ మెన్లకు మోసం చేయడం కాదని, ఇది పూర్తిగా ఓ ట్రిక్ కింద పరిగణించాలని కోరాడు.

ఇంతలా సంజయ్ మంజ్రేకర్ రియాక్ట్ అవ్వడానికి కారణం టీమిండియా మాజీ కెప్టెన్ ధోనినే. ఎందుకంటే కొత్తగా అమల్లోకి వచ్చిన నూరు నిబంధనల్లో ఫేక్ ఫీల్డింగ్ నిబంధన కింద కీపింగ్ కూడా వస్తుంది. దీంతో తన చేతిలో బంతి లేకున్నా ధోని చేతులు అలవాటులో పోరబాటుగా వికెట్ల వైపుకు వెళ్తే.. దానిని ఫేక్ ఫీల్డింగ్ గా పరిగణించి అయనపై ఐసీసీ చర్యలు తీసుకుంటుందా..? త్వరలోనే అంటే అసీస్ తో జరుగుతున్న టీ20లో భాగంగా ఇది జరుగుతుందా..? అంటే అవుననే అంటున్నారు క్రీడీ పవడితులు.

సాధారణంగా కీపింగ్ చేస్తున్న సమయంలో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు వికెట్ల మధ్య పరుగులు తీస్తున్న వేళ, దూరం నుంచి వచ్చే బంతిని ధోనీ, తన చేతులతో అడ్డుకుని, వికెట్లపైకి నెడతాడన్న సంగతి తెలిసిందే. బంతిని క్యాచ్ పట్టుకుని, వికెట్లను గిరాటు వేయకుండా, బంతి దారిని వికెట్లపైకి మళ్లించడంలో ధోనీ ఎంత దిట్టో తెలిసిందే. కొత్త నిబంధనల ప్రకారం, ధోనీ ఏ మాత్రం బంతిని అందుకోవడంలో విఫలమై, ఖాళీ చేతులను వికెట్ల వైపు చూపినా ఫేక్ ఫీల్డింగ్ కిందకే వస్తుందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంజ్రేకర్ బౌలర్లను తప్పదారి పట్టించి ఒక వైపు బంతిని మళ్లించేందుకు ప్రయత్నించి మరోవైపుకు కొట్టే బ్యాట్స్ మెన్లపై చర్యలేమి అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  fake fielding  sanjay manjrekar  ICC new rules  cricket  

Other Articles